నన్నడగొద్దు ప్లీజ్‌ 

24 Apr, 2018 00:18 IST|Sakshi

లవ్‌ డాక్టర్‌

హాయ్‌ అన్నయ్యా..! నేను పదేళ్లుగా మా బావగారి తమ్ముడిని ప్రేమిస్తున్నా. అతనికి కూడా నేనంటే ఇష్టం. మా ఇంట్లో, వాళ్ల ఇంట్లో కూడా ఓకే. కానీ వాళ్ల పెద్దనాన్న కొడుక్కి నన్ను అడిగారు. అప్పుడు మా వాళ్లు కుదరదని చెప్పేశారు. అంతే! అప్పటి నుంచి మా బావగారి తమ్ముడు ‘నువ్వంటే ఇష్టమే కానీ, ఐదు లక్షల కట్నం కావాలి’ అంటున్నాడు. నాకు ఏం చెయ్యాలో అర్థం కావడంలేదు. ఇప్పుడు నేను.. ‘నన్ను ఇష్టపడే వాడిని చేసుకోవాలి? లేక నేను ఇష్టపడేవాడిని చేసుకోవాలా?’ దయచేసి చెప్పండి అన్నయ్యా. నీలాంబరి హెల్ప్‌ తీసుకుని ఓ మంచి సలహా ఇవ్వండి. – షమీమ్‌
ఇద్దరినీ చేసుకోకు...!‘ఎంత శాడిస్ట్‌ సార్‌ మీరు?’ఇష్టమని చెప్పి డబ్బు గుంజే వెధవని చేసుకోమంటావా నీలూ?‘ఇష్టపడే బావగారి తమ్ముడి వాళ్ల పెద్దమ్మ కొడుకుని చేసుకోవచ్చు కదా సార్‌?’ షమీమ్‌ నా చెల్లెలు, షీ ఈజ్‌ స్ట్రాంగ్‌. వీడు కాకపోతే వాడు.. వాడు కాకపోతే ఇంకొకడు.. అని ప్రపోజ్‌ చేసిన ప్రతివాణ్ని కన్సిడర్‌ చెయ్యడానికి షమీమ్‌ ఆర్డినరీ గర్ల్‌ కాదు. నా బంగారం. తన ప్రేమకు వర్త్‌ కాండిడేట్‌దొరికిన రోజు, తనని గౌరవించే లక్షణాలు ఉన్నవాడు అయినప్పుడు, లైఫ్‌ లాంగ్‌ లవ్‌ చేసే వాడైనప్పుడు.. పెళ్లికి ఓకే చెప్పాలి. అప్పటి దాకా......... ‘డోంట్‌ హర్రీ... డోంట్‌ వర్రీ... డోంట్‌ మ్యారీ... అంటారు షమీమ్‌ వాళ్ల అన్నయ్య’ అని నవ్వింది నీలాంబరి.
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌
lovedoctorram@sakshi.com

మరిన్ని వార్తలు