నన్నడగొద్దు ప్లీజ్‌ 

25 Apr, 2018 00:46 IST|Sakshi

లవ్‌ డాక్టర్‌

హాయ్‌ అన్నయ్యా..! నేనొక అమ్మాయిని లవ్‌ చేశాను. తను కూడా నన్ను లవ్‌ చేసింది. మా మతాలు వేరు. టూ ఇయర్స్‌ పైనే ఫోన్‌లో మాట్లాడుకున్నాం. ఒకరోజు నాతో మాట్లాడుతూ ఉండగా తన మమ్మీకి దొరికింది. ఆ తర్వాత ‘నన్ను మరిచిపో’ అని చెప్పింది. కొన్నిరోజులకి తనే కాల్‌ చేసి ‘నువ్వు లేకుండా నేను బతకలేను’ అని చెప్పింది. ఏం జరిగిందో ఏమో.. సడన్‌గా నా నంబర్‌ బ్లాక్‌ చేసింది. నేను తనకోసమే వెయిట్‌ చేస్తున్నా. న్యూ నంబర్‌తో చాట్‌ చేశాను. ‘నువ్వు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకో’ అంది. ఎందుకు అని అడిగితే.. ‘మా డాడ్‌ కోసం నేను.. నా లవ్‌ని బ్రేక్‌ చేసుకున్నా’ అంది. మీ వాళ్లని ఒప్పించే పెళ్లి చేసుకుందామని చెప్పాను. కానీ తను ఒప్పుకోవడంలేదు. నా మ్యాటర్‌లోనూ, మా ఫ్యామిలీ మ్యాటర్‌లోనూ ఎంటర్‌ అయితే బాగుండదని నా నంబర్స్‌ అన్నీ బ్లాక్‌ చేస్తోంది. కొత్త నంబర్స్‌తో ట్రై చేస్తూనే ఉన్నా. బట్‌ తను మాత్రం మారడంలేదు. తన కోసం ఇప్పటికే ఫైవ్‌ ఇయర్స్‌ వెయిట్‌ చేశా అన్నయ్యా. తనని ఎలా మరిచిపోవాలో అర్థం కావడంలేదు. ప్లీజ్‌ నాకు మంచి సలహా ఇవ్వండి అన్నయ్యా. – అశోక్‌
చెట్లు నాటాలి.‘సార్‌ అశోక్‌ చక్రవర్తి చెట్లు నాటినట్లు... మన అశోక్‌ కూడా చెట్లు నాటితే.. లవ్‌ సక్సెస్‌ అవుతుందా సార్‌?’చెట్లు నాటితే పండ్లు వస్తాయి.‘అంటే రిలేషన్‌షిప్‌ అనే మొక్క నాటితే... అది ఎదిగి లవ్‌ ఫ్రూట్‌ ఇస్తుందని కదా సార్‌ మీ అర్థం?’శభాష్‌ నీలూ... యు ఆర్‌ సూపర్‌ స్మార్ట్‌..!‘ఒక అమ్మాయితో కలిసి రిలేషన్‌షిప్‌ అనే మొక్క ఆల్రెడీ నాటాడు కదా సార్‌. దాంట్లో ఆకులు తప్ప పండ్లు రాలేదు. కాబట్టి, ఇంకో రిలేషన్‌షిప్‌తో కలసి ఇంకో మొక్క నాటమంటున్నారా సార్‌?’అట్లా కాదు నీలూ. మొక్క పెట్టిన రోజు నుంచి ఎవ్రీడే ‘పండూ..పండూ’ అని యావగా మొక్కను చూస్తే ఎలా..? ‘కొంచెం వెయిట్‌ చెయ్యి, వర్కౌట్‌ అవుతుంది’ అని చెబుతున్నా...!‘వర్కౌట్‌ కాకపోతే.. ఫైవ్‌ ఇయర్స్‌ వేస్ట్‌ అయిపోతాయి కదా సార్‌?’అశోక్‌ నీకంటే చాలా స్మార్ట్‌ నీలూ.‘మొక్క చూసి పండు చెప్పగల సమర్ధుడు కదా సార్‌! ఆల్‌ ది బెస్ట్‌ అశోక్‌. హీ విల్‌ డిసైడ్‌ వెయిటింగ్‌ ఈజ్‌ బెటర్‌ ఆర్‌ నాట్‌! కదా సార్‌?’ ఎస్‌ నీలూ!!
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

ప్రేమ, ఆకర్షణ, టీనేజ్‌ అనుబంధాల్లోని అయోమయంమిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్‌ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్,  రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్‌–34. lovedoctorram@sakshi.com

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా