నన్నడగొద్దు ప్లీజ్‌ 

18 May, 2018 02:10 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

లవ్‌ డాక్టర్‌

హాయ్‌ అన్నయ్యా..! నాకు అన్నయ్యలు లేరు. అందుకే ఆ బంధమంటే చాలా అభిమానం. టూ ఇయర్స్‌ బ్యాక్‌ మా ఫ్యామిలీ పార్టీలో ఒక అన్నయ్య (పెద్దమ్మ కొడుకు) పరిచయమయ్యాడు. ఆ రోజువరకూ ఒకరికి ఒకరం తెలీదు కానీ, అన్నయ్యే కదా! అని బాగా క్లోజ్‌గా మాట్లాడాను. తర్వాత నుంచి తనతో అన్ని విషయాలు షేర్‌ చేసుకునేదాన్ని. తను కూడా నన్ను సొంత చెల్లెలుగానే ట్రీట్‌ చేస్తున్నాడు. అయితే తన లాస్ట్‌ బర్త్‌డేకి ‘హ్యాపీ బర్త్‌ డే అన్నయ్యా.. లవ్‌ యూ’ అని విష్‌ చేశాను. ఆ మెసేజ్‌ తన గర్ల్‌ఫ్రెండ్‌ చూసిందట. అప్పటి నుంచి తనని అనుమానిస్తోందట. రోజూ గొడవ పడుతోందట. వాళ్ల గొడవలకు నేనే కారణం అయ్యానని చాలా గిల్టీగా ఉంది అన్నయ్యా. బాగా ఏడుపొస్తోంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ప్లీజ్‌ సలహా ఇవ్వండి. – లక్కీ
ఓరి.. ఓరి.. ఓరి... బంగారుకన్నా....!మీ అన్నయ్య లైఫ్‌ని నువ్వు సేవ్‌ చేసావు.‘అదెలా సార్‌? లక్కీ... లవ్‌ యూ అన్నయ్యా అన్నందుకు, డౌట్‌ పడి, లక్కీ అన్నయ్యను మోస్ట్‌ అన్‌లక్కీ చేసేసింది కదా సార్‌? అందుకే కదా పాపం మీ చెల్లెలు సో మచ్‌ క్రయింగ్‌...! ఫీలింగ్‌ వెరీ వెరీ సాడ్‌...! మీకు లెటర్‌ రైటింగ్‌...! ఇదంతా జరిగింది కదా సార్‌?!? మరి మీరేంటి సార్‌.. లక్కీ, వాళ్ల అన్నయ్య లైఫ్‌ని సేవ్‌ చేసిందని అంటున్నారు?’లక్కీ వాళ్ల అన్నయ్యకి అలా రాసినందుకే అంత అనుమానించే అమ్మాయిని చేసుకుంటే లైఫ్‌ అంతా అన్‌లక్కీ అయిపోతుందని అందరికీ తెలిసిపోయింది. మై సిస్టర్‌ ఈజ్‌ గ్రేట్‌!!‘మీతో ఎంత కరెక్టుగా చెప్పించాను సార్‌?’ అందుకే నువ్వు కూడా చాలా గ్రేట్‌ నీలూ!!
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌ 
lovedoctorram@sakshi.com

మరిన్ని వార్తలు