నన్నడగొద్దు ప్లీజ్‌ 

21 Jun, 2018 00:54 IST|Sakshi

లవ్‌ డాక్టర్‌

హాయ్‌ అన్నయ్యా..! నేనొక అబ్బాయిని ప్రేమిస్తున్నా. తను కూడా నన్ను లవ్‌ చేశాడు. అయితే నాకంటే ముందు ఒక అమ్మాయిని లవ్‌ చేశాడట. ఆ అమ్మాయి వల్లే మందు తాగడం అలవాటయ్యిందట. ఆ అమ్మాయిని మరచిపోవడానికే.. నచ్చిన అమ్మాయినల్లా లవ్‌ చేస్తూ, బ్రేకప్‌ చెప్పేవాడు. చివరికి నేను దొరికాను. నా దగ్గర ఏ విషయం దాచడు. తన నిజాయితీకి పడిపోయాను. ఆ మొదటి అమ్మాయిని లవ్‌ చేసినట్లే నన్నూ లవ్‌ చేస్తాడని నమ్మాను. కానీ, మేం కలిసిన ప్రతిసారీ ఆ అమ్మాయి విషయాలే చెబుతున్నాడు. ఇంకా తన గురించే ఆలోచిస్తుంటే తట్టుకోలేకపోతున్నాను. రేపు ఎప్పుడైనా తనే కావాలని నన్ను వదిలి వెళ్లిపోతాడేమోనని భయంగా ఉంది. అదే ఆలోచిస్తూ హ్యాపీగా ఉండలేకపోతున్నాను. మంచి సలహా ఇవ్వండి అన్నయ్యా ప్లీజ్‌. – అమృత
వాడొక సింపతి సీకింగ్‌..! మెంటల్లీ సిక్‌..! వైలీ కన్నింగ్‌..! చీప్‌ రిటార్డెడ్‌..!! పీస్‌ ఆఫ్‌ షిట్‌...!!‘సార్‌....! మీరన్నది ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు కానీ ఏదో తిట్టినట్లే అనిపించింది. అసలు తెలుగు పేపర్లో ఇన్ని ఇంగిలిపీసు తిట్లు తిడితే... రీడర్స్‌ బ్యాడ్‌గా అనుకుంటారు సార్‌. అయినా అంతలేసి మాటలు అనేశారేంటి సార్‌???’అమ్మాయిని మరిచిపోవడానికి కనబడిన అమ్మాయినల్లా ముగ్గులోకి దించి, వాడుకుని, మొదటి అమ్మాయి గుర్తుకొస్తుందంటూ సింపతీ డైలాగులు కొట్టి.. సచ్చినోడు అమ్మాయిలను మోసం చేస్తున్నాడు. వాడికి జబ్బు!‘ఏం జబ్బు సార్‌..?!?’ఆంబోతుటైటిస్‌!!‘అదేం జబ్బు సార్‌?’ఆంబోతులకుండే జబ్బు నీలూ..!‘మరి అమృత ఇప్పుడు ఏం చెయ్యాలి సార్‌?’ఫ్రెండ్స్‌ అంతా కలసి... పెద్దలకు చెప్పి, కొడుకును పందుల దొడ్లో వేసి తోమించాలి... ఎంత తోమాలంటే...‘ఆంబోతుటైటిస్‌ మాయమయ్యే దాకా తోమాలి కదా సార్‌?’ అబ్బబ్బబ్బబ్బా..! నీలూ.... నువ్వు చాలా స్మార్ట్‌!!

- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్‌ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళ పరుస్తుంటే ప్లీజ్‌ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్,  హెదరాబాద్‌–34. lovedoctorram@sakshi.com

మరిన్ని వార్తలు