నన్నడగొద్దు ప్లీజ్‌ 

19 Dec, 2018 01:19 IST|Sakshi

హాయ్‌ సార్‌! నేను మీకు పెద్ద ఫ్యాన్‌ని. ఆరు నెలల క్రితం నేనొక అమ్మాయిని చూశాను. తను నాకు బాగా నచ్చింది. నేను తనని కలిసినప్పుడు తను బిజినెస్‌ చేసేది. దానికి సంబంధించి మనీ కావాలంటే కొంతవరకు హెల్ప్‌ చేశాను. నెల తర్వాత ‘నా బిజినెస్‌ కొలాప్స్‌ అయ్యింది. నేను చచ్చిపోతాను’ అంది. నేను తనకు బాగా ధైర్యం చెప్పి, లాస్‌ అయిన మనీ నేనే ఎలాగైనా ఎరేంజ్‌ చేస్తానన్నాను. తనకు హెల్త్‌ ప్రాబ్లమ్‌ వచ్చినప్పుడు కూడా ఖర్చులకు నేనే ఇచ్చేవాడిని. ఒకసారి మ్యారేజ్‌ చేసుకుందామని ప్రపోజ్‌ చేశాను. తనేమో ‘మా పేరెంట్స్‌ ఎవరిని చేసుకోమంటే వాళ్లనే చేసుకుంటాను’ అంది. తనకు ఆల్‌రెడీ ఒక అబ్బాయి ప్రపోజ్‌ చేస్తే అదే సమాధానం చెప్పిందట. కానీ ఇప్పటికీ నా దగ్గర ఖర్చులకు మనీ తీసుకుంటూనే ఉంది. మనీ ఇవ్వకపోతే ఏడుస్తోంది. ఇప్పటికే తన కోసం చాలా మనీ ఖర్చుచేశాను. ‘నువ్విచ్చిన మనీ లెక్క అంతా నా దగ్గర ఉంది. నీకు తిరిగి ఇచ్చేస్తాను’ అంటోంది. అసలు తనకి నా మీద లవ్‌ ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి? తను లేకపోతే నేను బతకలేను. ప్లీజ్‌ మంచి సలహా ఇవ్వండి.
– నాగు


టాటా..!! వీడుకోలు ..!గుడ్‌ బై..! ఇంక సెలవు..!తొలినాటి స్నేహితులారా...చెలరేగే కోరికలారా...ప్రియురాలి వలపుల కన్నా...నును వెచ్చనిదేదీ లేదని...నిన్నను నాకు తెలిసింది...ఒక చిన్నది నాకు తెలిపింది...ఆ ప్రేమ నగరుకే పోతాను.. పోతాను.. పోతాను..!!‘ఏంటి సార్‌!? ఎప్పుడో వచ్చిన బుద్ధిమంతుడు సినిమాలో పాట పాడుతున్నారు. అక్కడ నాగు డబ్బులు... ఇస్తూ... ఇస్తూ.. ఇస్తూ... పోతాడు...పోతాడు... పోతాడు..’ఇచ్చుటలో ఉన్న హాయీ.. వేరెచ్చటనూ లేనే లేదని...లేటుగ తెలుసుకున్నాను.. నా లోటును దిద్దుకున్నాను...‘సార్‌! సార్‌!! సార్‌!! ఆపండి సార్‌! అదే పాట పాడి నాగును కన్ఫ్యూజ్‌ చెయ్యకండి. నాగు...! అర్థమైందా..!? లేటుగా అయినా లోటును తెలుసుకో. లేకపోతే మునిగిపోతావు... పోతావు...పోతావు...!’అవును నాగు! అమ్మాయి స్టేబుల్‌ పర్సన్‌ కాదు. అసలు ఇన్వాల్వ్‌ కావద్దు. గుండె దిటవు చేసుకో. బి స్ట్రాంగ్‌! లవ్‌ యు. టేక్‌ కేర్‌! టాటా.. వీడుకోలు.. గుడ్‌ బై.. ఇంక సెలవు!! ‘అని చెప్పమంటున్నారు కదా సార్‌!!’
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌
- lovedoctorram@sakshi.com

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సీఐడీలకే డాడీ!

నోరు బాగుంటే... హెల్త్‌ బాగుంటుంది!

ముద్దమందారం పార్వతి

సిగనిగలు

మీరు బాగుండాలి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వైరల్‌ : సితారా డాన్స్‌ వీడియో..!

సమ్మరంతా సమంత

లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ని ఆపడం కుదరదు

‘మా’ను రోడ్డు మీదకు తీసుకురాకండి

ఇక ప్రేమ యుద్ధం

గొప్ప మనసు చాటుకున్న మంచు విష్ణు