నన్నడగొద్దు ప్లీజ్‌ 

13 Dec, 2018 00:39 IST|Sakshi

హాయ్‌ సార్‌! నేనొక అమ్మాయిని త్రీ ఇయర్స్‌ లవ్‌ చేశాను. తనకి ఎనిమిది నెలల క్రితమే ప్రపోజ్‌ చేశాను. తను ఒప్పుకుంది. కానీ తనకి అంతకు ముందే ఒకరితో బ్రేకప్‌ అయ్యిందని చెప్పింది. ‘నువ్వు ఆ అబ్బాయిని పూర్తిగా మరిచిపోతేనే నన్ను లవ్‌ చెయ్యి. లేకపోతే వద్దు’ అని చెప్పాను. తనని పూర్తిగా మరిచిపోయానంది. ‘సరే అయితే ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుందాం’ అని చెప్పాను. ఓకే అంది. అయితే రెండు నెలలు తర్వాత అతను కాల్‌ చేసి.. ‘మనం మళ్లీ లవ్‌ చేసుకుని పెళ్లి చేసుకుందాం’ అన్నాడట. ఆ విషయం నాకు పదిరోజుల తర్వాత చెప్పింది. ‘ఇది సరికాదు.. అతనికి నో అని చెప్పెయ్‌’ అన్నాను. తను మాత్రం ‘అతడిని వదులుకోవాలని అనిపించట్లేదు’ అంది. ‘నేను నీ లైఫ్‌లోకి రాక ముందు ఏం జరిగినా నాకు సంబంధం లేదు కానీ ఇప్పుడు అలా ఎలా కుదురుతుంది?’ అని అడిగాను. దాంతో మా విషయం ఆ అబ్బాయికి చెప్పిందట. ‘సరే గుడ్‌ బై’ అని చెప్పి వెళ్లిపోయాడట. ఆ తర్వాత ఇప్పటివరకూ బాగానే ఉన్నాం. కానీ ఇప్పుడు మన పెళ్లికి మా పేరెంట్స్‌ ఒప్పుకోరు, మనం విడిపోదాం’ అంటోంది. నాకు తను కావాలి. తన ప్రేమ కావాలి. ఒక్క వన్‌ ఇయర్‌ ఆగితే నేను లైఫ్‌లో సెటిల్‌ అవుతాను. ఆ తర్వాత మీ పేరెంట్స్‌ని ఒప్పిస్తాను’ అని చెబుతున్నా తను వినట్లేదు. ఇప్పుడు నేనేం చెయ్యాలి సార్‌?
– ఆంజనేయులు


అమ్మాయి జంపు కొట్టేసింది అన్నా!‘శుభం పలకరా పెళ్లికొడకా అంటే... ‘పెళ్లికూతురు లవ్‌ స్టేటస్‌ ఏంటి?’ అని అడిగాడట మునుపటికి ఓ ప్రబుద్ధుడు. అలా మిమ్మల్ని ఆంజనేయులు కలపమని సలహా అడుగుతుంటే.. అమ్మాయి జంపు గింపు అంటారేంటి సార్‌?’అమ్మాయి ఇంకా పాత లవ్వులోనే కూరుకుపోయి ఉంది. ఆంజనేయులు ప్రేమ చూసి అక్కడ నుంచి రీబౌండ్‌ అయ్యి ఆంజనేయులు హార్ట్‌లో పడింది. మళ్లీ ఆ అబ్బాయి కనపడేటప్పటికి...‘మళ్లీ రీబౌండ్‌ అయ్యి హార్ట్‌ అక్కడ పడిందా సార్‌ అమ్మాయిది?’అవును నీలూ! అమ్మాయి ఎమోషనల్‌ కండిషన్‌ చాలా వీక్‌గా ఉంది. ఇలాంటప్పుడు మనంఇన్‌వాల్వ్‌ అయితే...‘హార్ట్‌ ముక్కలు ముక్కలు అయిపోతుంది కదా సార్‌!?’అబ్బా ఏం క్యాచ్‌ చేశావు నీలూ! ఆంజనేయులు మెయిన్‌టెయిన్‌ డిస్టెన్స్‌. అలాంటి స్టేజ్‌లో ఉన్న అమ్మాయితో రిలేషన్‌ కోరుకోవడం....‘కొరివితో కాపురంలాంటిదే కదా సార్‌?’అబ్బబ్బబ్బా నీలూ.....! యూ ఆర్‌ వెరీ స్మార్ట్‌!!
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌
- lovedoctorram@sakshi.com

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నిలబడే ఉన్నారా!?

బంగారాన్ని వెలికితీసే శిలీంధ్రం

గంధపు చెక్క... పన్నీటి చుక్క

ఆశాదీక్షలే ఇరు భుజాలు

మామిడి ఉపయోగాలు

పండు తెచ్చావా లొట్టలేశావా?

నిశ్చల ప్రేమ కథా చిత్రం

బడికి నడిచి వెళితే ఊబకాయం దూరం!

మధుమేహులూ... కాలేయం జాగ్రత్త!!

గ్యాస్ట్రయిటిస్‌ నయం అవుతుందా?

మాడుతోందా?

ఇంటిప్స్‌

అసలు సంపద

అక్షరాలా అక్కడ ఫీజు లేదు

నాన్న ప్రేమకు స్టాంప్‌

అమ్మానాన్నలకు ఆయుష్షు

సూర్యవంశం అంజలి

ఉన్నట్టుండి కుడివైపు మూతి వంకరపోతోంది!

అలా పిలవొద్దు!

కృష్ణ పరవశం

మట్టితో మాణిక్యం

వానొస్తే వాపస్‌

మంచిగైంది

ఆ మాటలు ఇమామ్‌కు నచ్చాయి

స్కూటీతో సేద్యానికి...

నన్నడగొద్దు ప్లీజ్‌ 

చ. మీ. చోటులోనే నిలువు తోట!

ఫ్యూచర్‌ ఫుడ్స్‌!

2 ఎకరాల కన్నా 3 గేదెలు మిన్న!

నేను ఇలా చెయ్యడం సముచితమేనా? 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పవన్‌ కళ్యాణ్‌పై జాలేసింది

మరో సినిమా లైన్‌లో పెట్టిన విజయ్‌

ఇక పాకిస్తాన్‌ గురించి ఏం మాట్లడతాం?

‘నిశబ్ధం’ మొదలైంది!

చిన్నా, పెద్ద చూడను!

‘సీత’ మూవీ రివ్యూ