ఒంటరితనాన్ని ఇష్టపడుతున్నారా?

16 May, 2017 23:47 IST|Sakshi
ఒంటరితనాన్ని ఇష్టపడుతున్నారా?

సెల్ఫ్‌చెక్‌

చిన్నప్పుడే ఒంటరితనం అంటే ఏమిటో తెలుస్తుంది. చిన్న పిల్లలకు అమ్మ కనిపింకపోతే తల్లడిల్లిపోతారు. పదిమంది ఒకచోటకు చేరే సందర్భాల్లో కలవరు. సంఘంలో చిన్నచూపుకు గురవటం, సెల్ఫ్‌ కాన్ఫిడెన్స్‌ లేకపోవటం, చిన్న విషయాన్ని భూతద్దంలో చూడటం మొదౖలన కారణాలు లోన్లీనెస్‌ను ప్రేరేపిస్తాయి. అయితే ఒంటరిగా ఉండటం వల్ల కొన్ని లాభాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా క్రియేటివిటీకి లోన్లీనెస్‌ చాలా బాగా పనిచేస్తుంది. అయితే దీనికి హద్దు ఉండాలి. ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతున్నారా?

1.    ఎవరితోనైనా మాట్లాడటానికి, కలిసి తిరగటానికి ఇష్టపడరు.
    ఎ. అవును     బి. కాదు

2.    మీ చుట్టూ ఉన్నవారు మీలా ఉండరని మీకు నచ్చిన వ్యక్తి ఇప్పటివరకు కనిపించలేదని బాధ పడుతుంటారు.
    ఎ. అవును     బి. కాదు

3.    ఉద్వేగాలను అణుచుకోవటం కోసం ఒంటరి తనాన్ని కోరుకుంటారు.
    ఎ. అవును     బి. కాదు

4.    చెడ్డ అలవాట్ల (మద్యపానం లాంటివి) వల్ల ఒంటరితనాన్ని కోరుకుంటారు.
    ఎ. అవును     బి. కాదు

5.    ఎవరితో కలవకుండా మీలో మీరే కుమిలిపోతుంటారు. చెడు ఆలోచనలను అదుపు చేయటం మీవల్ల కాదు.
    ఎ. అవును     బి. కాదు

6.    జీవితంలో ఎదురుదెబ్బలు తిని ఉంటారు. దీనివల్ల అభత్రతాభావం మీలో ఉంటుంది.
    ఎ. అవును     బి. కాదు

7.    ఏమీ సాధించలే మని, నేనెందుకూ పనికిరానని అనుకుంటుంటారు.
    ఎ. అవును     బి. కాదు

8.    ఇతరుల అభిప్రాయాలతో ఏకీభవిం చరు. మీకు నచ్చినదే కరెక్ట్‌ అని వాదిస్తారు.
    ఎ. అవును     బి. కాదు

9.    ఎప్పుడూ పనిమీదే ధ్యాస. ఇతర విషయాలను పట్టించుకోరు. పుస్తకాలను ఎక్కువగా చదువుతుంటారు.
    ఎ. అవును     బి. కాదు

10.    ఎప్పుడూ పరధ్యానంలో ఉంటారు. మనోనిబ్బరం లేకుండా ఉంటారు.
    ఎ. అవును     బి. కాదు

‘ఎ’ సమాధానాలు ఏడు దాటితే మీరు ఒంటరితనాన్ని ఇష్టపడతారు. న్యూనతాభావంతో ఉంటారు. నిరాశావాదంలో ఉండకండి. మీ సమస్యలు, సంతోషం ఇతరులతో పంచుకుంటేనే మనసు తేలిక పడుతుంది. అనవసర భయాందోళనకు దూరంగా ఉండండి.

మరిన్ని వార్తలు