నన్నడగొద్దు ప్లీజ్‌

25 Apr, 2017 00:41 IST|Sakshi
నన్నడగొద్దు ప్లీజ్‌

లవ్‌ డాక్టర్‌

హాయ్‌ సర్, పది నెలలుగా నేను ఒక అబ్బాయిని లవ్‌ చేశాను. తను నా కొలీగ్‌. ప్రస్తుతం తను బెంగళూర్‌లో, నేను హైదరాబాద్‌లో వర్క్‌ చేస్తున్నాం. అయితే గత నెల మా పేరెంట్స్‌ నాకు సంబంధాలు చూడ్డంతో నేను లవ్‌ చేస్తున్నానని చెప్పేశాను. తను కూడా ఇంటికి వచ్చి మాట్లాడాడు. అయితే మా పేరెంట్స్‌కి తను నచ్చలేదు. పైగా కులాలు వేరు కావడంతో ఒప్పుకోలేదు. తను సెటిల్‌ అవ్వడానికి వన్‌ ఇయర్‌ టైమ్‌ అడిగాడు. మా పేరెంట్స్‌ కుదరదని చెప్పేశారు. ఆ మరునాటి నుంచి నన్ను ఆఫీస్‌కి పంపించడం లేదు. తను మరోసారి నన్ను కలిసేందుకు మా ఇంటికి వస్తే నేను లేనని చెప్పి పంపించేశారట.

మా నాన్నగారి కాళ్లు కూడా పట్టుకుని బ్రతిమాలాడు. అయితే నాకు పెళ్లి కుదిరిందని అబద్ధం చెప్పారట. (ఈ విషయం అంతా మా నాన్నే నాకు చెప్పారు). ఇప్పుడు ఇంట్లో వాళ్లకి తెలియకుండా మెయిల్స్‌ ద్వారా కాంటాక్ట్‌లో ఉన్నా. ఈ విషయం అంతా వాళ్ల అమ్మకు చెప్పాడట. తను ఫ్యామిలీ నుంచి ఏ ప్రాబ్లమ్‌ లేదు. నేను ఇప్పుడు మా పేరెంట్స్‌ని ఎలా ఒప్పించాలి. సలహా ఇవ్వండి సార్‌ ప్లీజ్‌.
– నందిని

కాళ్లు పట్టుకున్నా మీ నాన్న గారి గుండె కరగలేదంటే ఆయన నిన్ను ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడో అర్థం చేసుకో తల్లీ!
తండ్రికి బిడ్డ సంతోషాన్ని మించిన ఆనందం ఉండదు. నీ కంఫర్ట్‌ కోసం తపించే వారెవరయినా ఉన్నారంటే అది మీ నాన్నే. అల్లుడుగా తెచ్చుకోవాలంటే అతనికి అర్హతలు ఉండాలని నమ్ముతాడు. మానసికంగా బలమైనవాడై ఉండాలని కోరుకుంటాడు. కాళ్ల బేరానికి వచ్చాడంటే స్ట్రాంగ్‌ కాదేమో అని అనుకున్నారేమో..! ‘సార్, ఉత్తరం రాసింది మీ చెల్లెలా సార్‌’ అరే ఎలా కనిపెట్టావు? ‘మీ మొఖం చూస్తే తెలుస్తుంది సార్‌’ హౌ?! ‘అంత సీరియస్‌గా రాస్తుంటే అమ్మాయికి ఆన్సర్‌ ఇస్తున్నారని తెలిసిపోయింది.’ అబ్బాయిలకైతే సీరియస్‌గా రాయనా? ‘అబ్బాయిలకు రాస్తున్నప్పుడు మొఖంలో ఒక శాడిజం నాట్యం ఆడుతూ ఉంటుంది సార్‌.

వాడ్ని ఎలా తిట్టాలా? అని ఫిక్స్‌ అయ్యి.. ఆ తరువాత డీప్‌ బ్రీత్‌ తీసుకుని... ఇక అక్కడ నుంచి తిట్ల పురాణంతో తగులుకుంటారు సార్‌.’ ఇదంతా నా ఫేస్‌లో కనపడుతుందా..! ‘సినిమా చూసినంత క్లియర్‌గా. వాడు కాళ్ల మీద పడ్డాక కూడా కక్ష మానరు కదా.’ బట్, ఐ యామ్‌ టెల్లింగ్‌ ట్రూత్‌ నో? ‘నాటకాలు వద్దు సార్, కుదిరితే అబ్బాయిని తిట్టకుండా మీ చెల్లెలికి సొల్యూషన్‌ చెప్పండి చాలు’. నందినీ.. కాళ్ల మీద పడ్డ అబ్బాయి ప్రయోజకుడని, ఇంటి అల్లుడిగా అర్హుడని, నీకు తానే కావాలని, నిన్ను బాగా చూసుకుంటాడని, వాళ్ల పేరెంట్స్‌ మంచి వాళ్లని, ఒక్కసారి మీ పేరెంట్స్‌ని వాళ్ల పేరెంట్స్‌తో కలవమని కన్విన్స్‌ చెయ్యి తల్లీ! ‘ఈ ముక్క నేను అబ్జెక్షన్‌ చెప్పక ముందే చెప్పుంటే అరటిపండు దొరికేది..’ అని నవ్వింది పురుష పక్షపాతి నీలాంబరి.
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

ప్రేమ, ఆకర్షణ, టీనేజ్‌ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్‌ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి.
లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్‌–34. lovedoctorram@sakshi.com

మరిన్ని వార్తలు