నన్నడగొద్దు ప్లీజ్‌

30 Jul, 2017 23:09 IST|Sakshi
నన్నడగొద్దు ప్లీజ్‌

లవ్‌ డాక్టర్‌

హాయ్‌ సార్‌. నేను ఒక అమ్మాయిని లవ్‌ చేస్తున్నా. నన్ను చూసి నవ్వుతుంది. పైగా నేనంటే ఇష్టమని వాళ్ల ఫ్రెండ్స్‌తో చెప్పిందట. దాంతో నేను ప్రపోజ్‌ చేశాను. నో అంది. కానీ తను నన్ను చూడకుండా అసలు ఉండలేదు. నాకు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. వేరే వాళ్లు చాలా మంది నాకు ప్రపోజ్‌ చేశారు ఏం చెయ్యమంటారు? – సునీల్‌
మనకి అంత డిమాండ్‌ ఉన్నప్పుడు ఎందుకన్నా ఇక్కడే వేలాడ్డం? ‘ఏంటి సార్‌! పాపం... అంతగా బాధపడుతుంటే ఎందుకా తుంటరి ఆన్సర్‌ సార్‌?’ తానే చెబుతున్నాడు కదా చాలా మంది ప్రపోజ్‌ చేస్తున్నారని... మూవ్‌ ఎహెడ్‌ అని చెప్పా! ‘లేదులే సార్, ఆ ఆన్సర్‌లో విపరీతమైన వెటకారం గుప్పుమంటోంది!!’ నీకు అనుమానం ఎక్కువయిపోయింది!! ‘సరే సార్‌ నాకోసం ఇంకో టైప్‌ ఆన్సర్‌ చెప్పండి!!’

ప్రేమ ఎంత పవిత్రమో... నా ఆన్సర్‌ కూడా సో పవిత్రం ఇంకో టైప్‌ ఉండదు!! ‘చ్చా! ట్రై చేస్తారా.. పస్తుంటారా?’ నిన్న నో చెప్పింది! ఇవాళ నవ్వుతోంది!! రేపు ఎస్‌ అనొచ్చు! అనకపోతే.. ఎల్లుండి ఓకే అనొచ్చు!! అనకపోతే... ఆవలెల్లుండి.... ‘సార్‌.. సార్‌... అర్థమయింది! ఇదిగో మీ అరటిపండు!!’
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

ప్రేమ, ఆకర్షణ, టీనేజ్‌ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్‌ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి.
లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్‌–34. lovedoctorram@sakshi.com

మరిన్ని వార్తలు