నన్నడగొద్దు ప్లీజ్‌

4 Aug, 2017 23:09 IST|Sakshi
నన్నడగొద్దు ప్లీజ్‌

లవ్‌ డాక్టర్‌

హాయ్‌ సార్‌! తను, నేను 4 ఇయర్స్‌ నుంచి చాలా మంచి ఫ్రెండ్స్‌. ఒకసారి ఇద్దరికీ గొడవ జరిగి మాట్లాడ్డం మానేశాడు. అప్పుడు తనకి నాపై లవ్‌ ఫీలింగ్‌ కలిగిందట. తను నాకు చెప్పాడు. అప్పుడు నేను రిజెక్ట్‌ చేశా. అయినా తను నన్ను వదలకుండా కేరింగ్‌ తీసుకునేవాడు.నేను అడగకుండానే హెల్ప్‌ చేసేవాడు. తను చూపించే ప్రేమకి నాకూ ఆ ఫీలింగ్‌ కలిగింది. ఎక్స్‌ప్రెస్‌ చేశా. అయితే.. ‘ఇప్పుడు నీ మీద ఎలాంటి ఫీలింగ్‌ లేదు. ఒకప్పుడు ఉండేది సారీ’ అంటున్నాడు. కానీ తన పర్స్‌లో ఇంకా నా ఫోటో ఉంది. నేను ఇచ్చిన గిఫ్టులు అన్నిటినీ మెమరీగా దాచుకున్నాడు. ఒకప్పుడు నేనే తన ప్రపంచం. కానీ ఈ మధ్య నేను కాల్‌ చేస్తే వర్క్‌ ఉందని అబద్ధం చెబుతున్నాడు. అసలు నాపై తనకు ఉన్న అభిప్రాయం ఏంటి? ఇప్పుడు నన్ను ఏం చెయ్యమంటారు సార్‌ ప్లీజ్‌ చెప్పండి? – నీరజ
గేమ్స్‌ ఆడుతున్నాడు! నువ్వు తన విషయంలో వీక్‌ అని తెలుసుకుని గేమ్స్‌ ఆడుతున్నాడు! పట్టించుకోనట్లు ఉంటే నువ్వు నిండా మునిగిపోయి ‘శరణం శరణం..’ అని వెంటపడతావని తేలిపోయింది!! ‘‘మరి ఇప్పుడు నీరజ ఏం చెయ్యాలి సార్‌?’’ రివర్స్‌ గేమ్‌ ఆడాలి!‘‘అంటే.. వాట్‌ చెయ్యాలి?’’ ఫుల్‌గా అంజాన్‌ కొట్టాలి!! ‘‘అంజాన్‌?’’ ‘నువ్వు ఎవరు రా’ అన్నట్లు పట్టించుకోకుండా ఉండాలి!!

‘‘అప్పుడు ఏమౌతుంది సార్‌?’’ గిలగిలా కొట్టుకుంటాడు.. జ్వరం వస్తుంది!! ‘‘లవ్‌ డాక్టర్‌కి లెటర్‌ రాస్తాడు...’’ ఎస్‌!! ‘‘అప్పుడు మీ చెల్లెలి రివెంజ్‌ మీరు గడ్డి పెట్టి తీర్చుకుంటారు!!’’ ఎస్‌!! ‘‘ఇదిగోండి సార్‌ అబ్బాయిలను అంతగా టార్చర్‌ పెట్టే మీకు... అరటి ఆకు! తినండి!!’’
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్‌–34. lovedoctorram@sakshi.com

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా