మృదువుగా... దానిమ్మ!

3 Dec, 2014 22:32 IST|Sakshi
మృదువుగా... దానిమ్మ!

చలికాలం..
 
కోమలమైన చర్మం ఈ కాలం పొడిబారడం వల్ల గరకుగా తయారవుతుంది. మృతకణాలు పెరుగుతాయి. దీని వల్ల చర్మకణాలు నిస్తేజం కనిపిస్తుంది. ఫలితంగా మేనికాంతి తగ్గుతుంది. ఈ సమస్యలకు మేలిమి పరిష్కారం దానిమ్మ.

 మేనికి స్క్రబ్.. కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్, గోధుమ రంగు పంచదార, తేనె రెండు టేబుల్ స్పూన్ల చొప్పున తీసుకోవాలి. దానిమ్మ గింజలు (చిదపాలి), కమలాపండు తొక్కల గుజ్జు, రోజ్ వాటర్ టీ స్పూన్ చొప్పున, కోకా పౌడర్ రెండు టీ స్పూన్ల తీసుకోవాలి. ఈ పదార్థాలన్నీ ఒక గాజు పాత్రలో వేసి, చెక్క స్పూన్‌తో కలపాలి. ఈ మిశ్రమం దేహానికి పట్టించి, రుద్దాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఈ మిశ్రమం చర్మానికి మంచి స్క్రబ్‌లా ఉపయోగపడుతుంది. దానిమ్మ నూనెలో ఉండే కెరటినోసైట్స్ కణాలను ఉత్తేజితం చేసి, మృతకణాలు తొలగించి చర్మాన్ని మృదువుగా మారుస్తాయి. ముడతలను నివారిస్తాయి. కొన్ని చుక్కల దానిమ్మ రసంలో కొద్దిగా కొబ్బరినూనె కలిపి బుగ్గలకు, పెదవులకు రాసుకుంటే చర్మం పొడిబారదు. దానిమ్మ గింజల్ని భోజనం తర్వాత తీసుకుంటే ఆరోగ్యకరం.

 ఎర్రై పెదవులకు... పొడిబారడం, చిట్లడం... వంటివి చలికాలం పెదవులు ఎదుర్కొనే ప్రధాన సమస్యలు. పెట్రోలియమ్ జెల్లీ, వెన్న వంటివి ఉపయోగించినా పెద్దగా ప్రయోజనం లేకపోతే.. దానిమ్మ నూనెను పెదవులకు రాయండి. మృదుత్వం, ఆరోగ్యకరం, మరింత ఎరుపును మీ పెదవులకు తెచ్చిపెడుతుంది. దానిమ్మ నూనె గల లిప్ బామ్‌లూ మార్కెట్లో లభిస్తున్నాయి. చిట్లిన, పొడిబారిన పెదవులకు ఈ లిప్‌బామ్స్ మంచి పరిష్కారం.
 
 

మరిన్ని వార్తలు