నిజాం క్లర్క్‌ నుంచి మేయర్‌ దాకా..

22 Jan, 2019 00:47 IST|Sakshi

నాటి నిజాం నిరంకుశ పాలనలో తెలు గువారు అనుభవించే బాధలు చూడలేక తెలుగువారి ఉనికిని కాపాడటానికి తెలంగాణ ప్రాంతంలో ఆంధ్రోద్య మాన్ని వ్యాపింపజేసిన నాయకులలో మాడపాటి హనుమంతరావు ఒకరు. మాడపాటి కృష్ణా జిల్లా నందిగామ తాలుకాలోని పొక్కునూరు గ్రామంలో జనవరి 22, 1825లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. తండ్రి చిన్న తనంలోనే మరణించడంతో, తెలంగాణ ప్రాంతంలో నిజాం ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తున్న మేనమామల ఇంటికి తల్లి తన పెద్ద న్నలతో స్వగ్రామం నుంచి తెలంగాణ ప్రాంతానికి మకాం మార్చారు. వరంగల్లులో 1903లో మెట్రిక్యులేషన్‌ ప్యాసయి, వరంగల్లు విద్యాశాఖలో ‘మీర్‌ మున్షి’ (క్లర్క్‌)గా 1904లో చేరి 8 ఏళ్లు కొనసాగారు. వరం గల్లులో ఉద్యోగం చేస్తున్న రోజుల్లోనే పలు సాంఘిక, సాంస్కృతిక విద్యా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొనేవారు.  హైదరాబాద్‌కు మకాం మార్చి, నిజాం ప్రభుత్వ శాసనసభలో అనువాదకుడిగా పనిచేస్తూనే ప్రైవేటుగా లా పూర్తి చేశారు. ప్రముఖ న్యాయవాది రాయి విశ్వేశ్వరనాథ్‌ దగ్గర జూనియర్‌గా చేరారు. 1917లో హైదరాబాద్‌లోని హైకోర్టులో వకీలుగా స్వతంత్రంగా

న్యాయవాద వృత్తి చేపట్టి పేరొందారు..
1952–53, 1953–54లలో మూడుసార్లు వరుసగా హైదరాబాద్‌ మేయర్‌గా ఎన్నికయ్యారు. హైదరా బాద్‌ మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వ హించడం మొదలుపెట్టాక ఎన్నికైన తొలి నగర మేయర్‌ మాడపాటివారే. ఆయన పలు వినూత్న పథకాలు ప్రవే శపెట్టారు. ఆ తర్వాత 1958లో రాష్ట్ర లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌గా ఆయన ఆరు సంవత్సరాలు నిష్పక్షపాతంగా సమర్థవం తంగా నిర్వహించారు. జన వరి 26, 1955లో పద్మ భూషణ్‌ అవార్డు అందుకున్న తొలి తెలుగు పెద్దగా నిలిచిన ఆయనను, 1956లో ఉస్మానియా వర్సిటీ గౌరవ డాక్టరేట్‌తో సత్కరిం చింది. మాడపాటి 85 ఏళ్ల వయస్సులో నవంబర్‌ 11, 1970లో కన్నుమూశారు. నాటి ప్రముఖ హిందీ నవలా రచయిత ప్రేమ్‌చంద్‌ రాసిన హిందీ రచనలను తెలుగులోకి అనువదించినవారిలో ప్రథ ములు. తెలంగాణ–ఆంధ్ర ఉద్యమాల గురించి రెండు సంపుటాలను ఆయన రచించారు.
(నేడు మాడపాటి జయంతి)
కొలనుపాక కుమారస్వామి మొబైల్‌ : 99637 20669

మరిన్ని వార్తలు