కాపీ కేసు

22 Jun, 2020 08:06 IST|Sakshi

మెప్పుల కోసం గొప్పలు చెప్పుకోవడం ఎవరి పేటెంట్‌ హక్కూ కాదని మద్రాస్‌ హై కోర్టు తీర్పు ఇచ్చింది. రెండు పెద్ద కంపెనీల మసాలా గొడవ ఇది. 2013 నుంచీ సాగుతోంది. ఐ.టి.సి. కంపెనీ ‘ఇప్పీ’ నూడుల్స్‌ ప్యాకెట్‌ మీద ‘మేజిక్‌  మసాలా’ అని ఉంటుంది. నెస్లే కంపెనీ మ్యాగీ నూడుల్స్‌ ప్యాకెట్‌ మీద ‘మేజికల్‌ మసాలా’ అని ఉంటుంది. ఈ కారణంగానే నెస్లే మీద ఐ.టి.సి.  కేసు వేసింది. తమ ‘మేజిక్‌’ నే ‘మేజికల్‌’గా నెస్లే కాపీ కొట్టిందని ఐ.టి.సి ఆరోపణ. ‘కాపీ కొట్టినట్లు ఆధారం ఏమిటి?’ అనే వాదనకు ‘మేము మేజిక్‌ అని పెట్టిన మూడేళ్లకు వాళ్లు మేజికల్‌ అని పెట్టుకున్నారు’ అని తన వాదన వినిపించింది. కోర్టుకు ఆ వాదన సంతృప్తికరంగా అనిపించలేదు. ‘మేజిక్‌ మసాలా, మేజికల్‌ మసాలా అని చెప్పుకొనే గొప్పలపై ఎవరికీ గుత్తాధిపత్యం ఉండదని అంటూ కేసును కొట్టేసింది. బిజినెస్‌ అన్నాక కాపీలు తప్పవు. కోర్టు వెళ్లడం కన్నా కొత్తదారిలోకి వెళ్లడం కొన్నిసార్లు లాభదాయకంగా ఉంటుంది. కానీ.. పెద్ద కంపెనీలు కదా.. తాడో పేడో అనుకుంటాయి.(కాలక్షేపం కోసం వీటిని తినేస్తున్నారు..)
చదవండి: 'ఇది త‌యారు చేసినవాడిని చంపేస్తా’

మరిన్ని వార్తలు