మ్యాజిక్ డ్రెస్

13 Jul, 2013 02:58 IST|Sakshi
మ్యాజిక్ డ్రెస్
 బేబీ ఏంజిల్స్ ఏం తొడిగినా...
 బ్యూటిఫుల్‌గానే ఉంటారు.
 గౌనైతే చెప్పాలా!
 బుగ్గన దిష్టి చుక్క పెట్టాల్సిందే!
 ఔను! గౌను రకరకాల మ్యాజిక్‌లు చేస్తుంది.
 చిట్టి చిన్నారుల్ని బంగారు బొమ్మల్లా మార్చేస్తుంది.
 పూలరెక్కల తళుకుల్ని తాకి తెచ్చి,చెంపలకు అద్దుతుంది.
 రెయిన్‌బో రంగులన్నీ పిండుకొచ్చి చిలకరిస్తుంది.
 ఇన్నెందుకండీ?!
 గౌను వేసుకున్న వరాల మూటని చూస్తే...
 ఎగురుకుంటూ పోతున్న బటర్‌ఫ్లై కూడా ముద్దివ్వడానికొస్తుంది!
 మరి మీ మురిపాలను...
 అల్లారు ముద్దులతోనే సరిపెడతారా?!
 
 1- పర్పుల్ కలర్ షేడెడ్ వెల్వెట్ క్లాత్‌తో డిజైన్ చేసిన ఫ్రాక్ ఇది. నలుపు, సిల్వర్ కలర్స్ మేళవింపుతో తీర్చిదిద్దిన వెయిస్ట్‌కోట్ వేయడంతో వెస్ట్రన్ పార్టీ వెలిగిపోతుంది.
 
 2-  లేత గులాబీరంగు మెత్తని షేడెడ్ నెట్‌తో చేసిన అంబ్రెల్లా కట్ గౌను ఇది. నడుము పైభాగంలో జతచేసిన కోరా కలర్ గులాబీలు, మెరిసే క్రిస్టల్స్ చిన్నారి నవ్వులతో పోటీపడుతున్నాయి. 
 
 3- వెల్వెట్, నెటెడ్ ఫ్యాబ్రిక్‌తో నలుపు, ముదురు ఎరుపు రంగు కాంబినేషన్లతో తీర్చిదిద్దిన గౌన్ ఇది. క్రీమ్ కలర్ నెటెడ్ మెటీరియల్‌తో డిజైన్ చేసిన గులాబీలు గౌన్‌కు అదనపు హంగులు తెచ్చాయి.
 
 4- పోల్కాడాట్స్‌గల వంగపండురంగు నెటెడ్ మెటీరియల్‌తో డిజైన్ చేసిన బబుల్ ఫ్రాక్ ఇది. లైనింగ్‌గా వెల్వెట్ క్లాత్, నెక్ లైన్‌కి నీలంరంగు గులాబీలు సెట్ చేయడంతో ముచ్చట గొలుపుతోంది.
 
 మోడల్స్
 నిత్య, దీక్షిత
 
 డిజైనర్
 సుదీప, ఆలన బొటిక్, బంజారాహిల్స్, హైదరాబాద్
 నిర్వహణ: నిర్మలారెడ్డి, ఫొటోలు: శివ మల్లాల
మరిన్ని వార్తలు