ఆమె  ఆరోగ్యం

8 Mar, 2019 01:25 IST|Sakshi

సాక్షి మహిళలను జాగృతం చేయడానికిమహిళల్లో ఉన్న శక్తిని సమాజానికే కాదు... వారికీ తెలిసేలా చేయడానికి ఎప్పుడూ ముందడుగు వేస్తూనే ఉంది. కాపాడుకోవడం... పరిరక్షించుకోవడం... సమాధాన పరచడం... పరామర్శించడంఇవి కాదు మహిళలకు కావల్సింది. వారిలో ఉన్న శక్తికి అద్దం పట్టాలి.‘నువ్వే శక్తి’ అని మహిళలకు సాక్షి గుర్తు చేస్తోంది.మహిళ అంటే మాకు గౌరవం... మాకు స్ఫూర్తి!మా అక్షరానికి శక్తి... జై స్త్రీ శక్తి!!


ఆకుకూరలు...  ఇందులో ఉండే మెగ్నీషియం, విటమిన్‌ కె, విటమిన్‌ సి, ఫైటో న్యూట్రియెంట్స్‌ వల్ల ఎముకలు దృఢంగా, బలంగా పెరుగుతాయి.

తృణధాన్యాలు...  బ్రౌన్‌ రైస్, కినోవా జీర్ణశక్తిని బలపరుస్తాయి. జీర్ణకోశం స్వచ్ఛంగా ఉంటే, మలబద్దకాన్ని, కోలన్‌ క్యాన్సర్‌ని నివారించుకోవచ్చు.

నట్స్‌...  శరీరానికి కావలసిన విటమిన్లు, మినరల్స్, ఆరోగ్యకరమైన కొవ్వులు లభిస్తాయి. ఇవి ఎముకలను బలంగా చేస్తాయి. బాదం పప్పులలో ఎముకలను దృఢపరిచే గుణాలు ఉన్నాయి. పిస్తాలలో మెగ్నీషియం, పొటాషియం, విటమిన్‌ బి6లు ఎక్కువగా ఉన్నాయి.

కోడిగుడ్లు...  ఇందులో విటమిన్‌ డి అధికంగా ఉంటుంది. 

ఉల్లిపాయలు...  ఉల్లిపాయలలో ఎముకలకు బలాన్ని కలిగించే శక్తి ఎక్కువ. రోజుకో ఉల్లిపాయ తినడం వల్ల ఎముకలలో రోజుకి ఐదు శాతం చొప్పున శక్తి సమకూరుతుంది. 50 సంవత్సరాలు దాటిన మహిళల మీద .జరిపిన పరీక్షలో తుంటి ఎముక విరగడం అనేది 20 శాతం తక్కువ కనిపిస్తోంది. 

పెరుగు...  పెరుగు లేదా మజ్జిగను ఎక్కువగా తీసుకోవాలని ప్రాచీన కాలం నుంచి చెబుతున్నారు. ఇందులో ఉండే ప్రోబయాటిక్‌ బ్యాక్టీరియా... జీర్ణక్రియను సవ్యంగా సాగేలా చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వెజైనల్‌ ఇన్‌ఫెక్షన్స్‌ రాకుండా చూస్తుంది. 

టొమాటోలు...  టొమాటోలు తినడం వల్ల బ్రెస్ట్‌ క్యాన్సర్, సర్వైకల్‌ క్యాన్సర్‌ రాకుండా కాపాడుకోవచ్చు. గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. 

పాలు...  ఇందులో ఉండే క్యాల్షియం, పొటాషియం, విటమిన్‌ బి 12 వంటివి ఉంటాయి. ఇవి ఎముకలకు దృఢత్వాన్ని ఇస్తాయి. బ్రెస్ట్‌ క్యాన్సర్, కాలన్‌ క్యాన్సర్‌ రాకుండా నిరోధిస్తాయి.

అరటిపళ్లు...  ఇందులో ఉంటే పొటాషియం, శరీర వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చూస్తుంది. మలబద్దకాన్ని దూరం చేస్తుంది.

మరిన్ని వార్తలు