మలేరియా దోమరణం

2 May, 2017 00:09 IST|Sakshi
మలేరియా దోమరణం

పరిపరి శోధన

మలేరియా దోమతో తమాషా కాదు. అలా కుట్టి ఇలా వెళ్లిపోతుంది. కానీ ఈ మలేరియా దోమ కాటుతో ప్రపంచంలో సగం మంది జనాభా మలేరియా బారిన పడే అవకాశం ఉన్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రతి 45 సెకన్లకు ఒక శిశువు మలేరియా దోమ కాటు మూలంగా ప్రాణం విడుస్తున్నట్లు లెక్కలు చెపుతున్నాయి. అలాగే మలేరియా మరణాల్లో 90 శాతం మరణాలు ఆఫ్రికా ఖండంలోనే చోటుచేసుకోవడం గమనార్హం.

ఆర్థికంగా ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న దేశాల్లో మలేరియా వ్యాధి విజృంభిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు.
మలేరియా దోమ రాత్రిపూట కుడుతుంది. మనిషి రక్తంలోకి పేరసైట్లను ప్రవేశపెట్టి రోగానికి కారణమవుతుంది. మలేరియా వ్యాధి... 9 నుంచి 14 రోజులపాటు జ్వరం, వణకడం, వాంతులు వంటి లక్షణాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స చేయించాలి.

మరిన్ని వార్తలు