డెంగీ దోమల్లో వ్యాధి వ్యాప్తిని తగ్గించే ‘వోబాకియా’ బ్యాక్టీరియా!

25 Nov, 2019 03:04 IST|Sakshi

పరి పరిశోదన

ఈ సీజన్‌లో డెంగీ మన తెలుగు రాష్ట్రాల ప్రజల్ని ఎంతగా గడగడలాడించిందో తెలుసు కదా. ఇక్కడే కాదు... మనలాంటి వేడి వాతావరణం ఉండే ఎన్నో దేశాల్లో డెంగీ వేధిస్తోంది. డెంగీ వ్యాధిని అదుపు చేయడానికి ఒక మార్గాన్ని కనుకున్నారు మలేషియాలోని కౌలాలంపూర్‌ పరిశోధకులు. అక్కడి పరిశోధకులే కాదు... ఆస్ట్రేలియా, వియత్నాం వంటి దేశాలతో పాటు యూనివర్సిటీ ఆఫ్‌ గ్లాస్గో, మెల్‌బోర్న్‌ వంటి విద్యాసంస్థల్లో జరిగిన పరిశోధనల కారణంగా మానవాళికి మేలు చేసే ఒక శుభవార్త లోకానికి  తెలిసింది. పరిశోధనశాలల్లో ఉన్న డెంగీని వ్యాప్తి చేసే ఏడిస్‌ ఈజిపై్ట దోమల్లోకి ‘వొబాకియా (Wolbachia) అనే బ్యాక్టీరియాని ఇంజెక్ట్‌ చేసి వాటిని బయటి వాతావరణంలోకి విడుదల చేశారు.

ఆ బ్యాక్టీరియాతో ఇన్ఫెక్ట్‌ అయిన తర్వాత అవే దోమల్లో ప్రత్యుత్పత్తి జరిగాక పుట్టిన తర్వాతి తరం దోమల్లో డెంగీని వ్యాప్తి చేసే శక్తి గణనీయంగా తగ్గిపోయినట్లుగా పరిశోధకులు గుర్తించారు. ఈ కారణంగానే ఆ మరుసటి ఏడాది అక్కడ 40 శాతం తక్కువగా డెంగీ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఉష్ణమండల  (వాతావరణంలో వేడిమి 36 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉన్న) ప్రాంతాల్లో డెంగీ వ్యాప్తి గణనీయంగా తగ్గడం గుర్తించిన పరిశోధకులు...  ఈ పరిశోధన ఫలితాలు ‘కరంట్‌ బయాలజీ’ అనే జర్నల్‌లో నమోదయ్యాయి. ప్రస్తుతానికి ఈ వొబాకియా పరిశోధనలు డెంగీకి మాత్రమే పరిమితమయ్యాయి. ఇలాంటి హానిచేయని బ్యాక్టీరియాలను ఉపయోగించి మరిన్ని వ్యాధులను అదుపు చేసే విధంగా పరిశోధనలు సాగుతున్నాయి.

మరిన్ని వార్తలు