మేలు మామిడి

18 Apr, 2017 23:44 IST|Sakshi
మేలు మామిడి

గుడ్‌ ఫుడ్‌

మార్కెట్‌లోకి మామిడిపండ్లు విరివిగా వస్తున్నాయి. వాటికి సీజన్‌ ఇది. బంగారపు రంగులో మిసమిసలాడే ఈ పండ్లు నిజంగానే బంగారమంటున్నారు పరిశోధకులు. మామిడిలో ఏమేముంటాయి: చిన్న కప్పు మామిడి ముక్కల్లో 100 క్యాలరీల శక్తి ఉంటుంది. దీనిలో ఒక గ్రాము ప్రోటీన్లు, 0.5 గ్రాముల కొవ్వులు, 25 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 23 గ్రాముల చక్కెర, 3 గ్రాముల పీచు, ఒక రోజుకు ఒక మనిషికి అవసరమైనన్ని విటమిన్లు ఉంటాయని ఒక అంచనా.

మామిడి ప్రయోజనాలు
⇒మామిడి పెద్దపేగుకు క్యాన్సర్‌ వచ్చే అవకాశాలను సమర్థంగా నివారిస్తుంది.
⇒కంటిచూపును దెబ్బతీసే జబ్బు ‘మాక్యులార్‌ డీజనరేషన్‌’ ముప్పును తప్పించగల శక్తి దీని సొంతం.
⇒మామిడిలో పీచు పదార్థం ఎక్కువ కాబట్టి మలబద్ధకానికి ఇది స్వాభావికమైన మందుగా పరిగణించవచ్చు.
⇒కంటిచూపును మెరుగుపరిచేందుకు అవసరమైన బీటా–కెరటిన్‌ మామిడిలో పుష్కలంగా ఉంటుంది.
⇒మామిడిలోని బీటా కెరొటిన్‌ పోషకమే ప్రోస్టేట్‌ క్యాన్సర్‌తో పాటు... రొమ్ము, లుకేమియా వంటి అనేక క్యాన్సర్ల నివారణకూ తోడ్పడుతుంది.
⇒మామిడిలో ఉండే పొటాషియమ్‌ కారణంగా అది గుండెజబ్బుల (కార్డియో వాస్క్యులార్‌ డిసీజెస్‌)నూ, రక్తపోటునూ నివారిస్తుంది.
 

whatsapp channel

మరిన్ని వార్తలు