ఈ వంట... ఆ వంట... మన ఇంట

29 Sep, 2018 00:22 IST|Sakshi

ఫుడ్‌ ప్రింట్స్‌

‘మనీష్‌ మెహ్రోత్రా ప్రపంచంలో అత్యున్నత స్థానంలో ఉన్న భారతీయ చెఫ్‌’ అంటారు వీర్‌ సంఘ్వి. బిహార్‌లోని పాట్నాలో జన్మించిన మనీష్, ముంబైలో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు చేస్తున్న రోజుల్లోనే వంటకాల మీద అభిమానాన్ని ప్రేమను పెంచుకున్నాడు. ‘ఓల్డ్‌ వరల్డ్‌ హాస్పిటాలిటీ ఓరియెంటల్‌ ఆక్పోస్‌’ (ద పాపులర్‌ మెంబర్స్‌ రెస్టారెంట్‌ ఎల్‌ ఇండియా హాబిటేల్‌ సెంటర్, ఢిల్లీ) లో 2000 సంవత్సరంలో చేరిన తరువాత, ఆసియా ఖండమంతా పర్యటించి, అక్కడివారికి ‘పాన్‌ ఆసియా క్విజీన్‌’లో శిక్షణ ఇవ్వాలనుకున్నారు. అక్కడ నుంచి తిరిగి వచ్చాక 2009లో ‘ఇండియా యాక్సెంట్‌’ను స్థాపించి, అతి తక్కువ కాలంలోనే ప్రపంచ ఖ్యాతి చెందారు. అనేక అవార్డులు అందుకున్నారు.

గ్రేట్‌ ఆర్ట్, సింపుల్‌ రెసిపీ...
కుటుంబాన్ని ఒకచోట చేర్చుతారు, వారివే అయిన రుచులతో వారికి ఆనందంతో పాటు ఆశ్చర్యం కలిగిస్తారు. భారతదేశంలోనే ప్రసిద్ధి గాంచిన చెఫ్‌ అయిన మనీష్, ఢిల్లీలోని ‘ద లోధీ రెస్టారెంట్‌’లో వంటలతో ఫ్యూజన్‌ చేస్తున్నారు. చ్యవనప్రాశను క్రీమ్‌ బ్రూలీతో, ఆమ్లా మురబ్బాను తందూరీతో, కిచ్‌డీని వేయించిన పోర్క్‌తో ఫ్యూజన్‌ చేస్తున్నారు. ఆయన మన ఆహారం గురించి ‘‘భారతీయ వంటకాలను అంతర్జాతీయ విధానంలోను, విదేశీ వంటకాలను భారతీయ విధానంలోనూ చూపుతాను’’ అంటున్నారు. భోజన ప్రియుల నాలుకలు నిరంతరం కొత్త రుచుల కోసం ఉవ్విళ్లూరుతుంటారు. ఆ రుచులకు అనుగుణంగానే మనీష్‌ మెహ్రోత్రా కొత్త కొత్త వంటకాలు కనిపెడుతున్నారు. గత మూడు సంవత్సరాలుగా ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన 50 రెస్టారెంట్లలో ‘ఇండియన్‌ యాక్సెంట్‌’ ఉంటోంది. 2017లో ట్రిప్‌ అడ్వయిజర్‌ ఈ రెస్టారెంట్‌కి మొదటి ర్యాంకు ఇచ్చింది. ఆసియాలో 2వ స్థానంలోను, ప్రపంచంలో 19వ స్థానంRecipesలోను ఉంది మ్యాస్ట్రో మెహ్రోత్రా రూపొందించిన ఈ రెస్టారెంట్‌.

మరిన్ని వార్తలు