ఫాలో... ఫాలో.. ఫాలో...

30 Nov, 2017 00:27 IST|Sakshi

‘మిస్‌ వరల్డ్‌’ కాంపిటీషన్‌లో ఉన్న అందగత్తెలందరూ మానుషీ చిల్లర్‌ని బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుకున్నారు. అందమైన అమ్మాయిలకే మానుషీ అంత అందంగా అనిపించిందన్నమాట! మరి అంత అందగత్తెని మీడియా మూవ్‌ చెయ్యకుండా ఉంటుందా? ‘బాలీవుడ్‌కి వస్తారా?’ అని అడిగింది. ‘ఇప్పటికైతే నా మిస్‌ వరల్డ్‌ అక్కచెల్లెళ్లతో  (రుతుక్రమ శుభ్రత) పై అవగాహన పెంచడానికి ప్రపంచమంతా తిరుగుతున్నాం’ అని చెప్పింది చిల్లర్‌.

అంతటితో ఆగుతుందా మీడియా? మళ్లీ మూవ్‌ చేసింది. ‘ఆ తర్వాతైనా వస్తారండీ బాలీవుడ్‌కి?’ అని అడిగింది. ‘ఓ ఎస్‌. ఆమిర్‌ఖాన్‌ పిలిస్తే వస్తా. ప్రియాంకా చోప్రా తలిస్తే వస్తా’ అంది చిల్లర్‌.  ‘వీళ్లిద్దరేనా, ఇంకెవరు పిలిచినా, తలచినా రారా?’ అంది మీడియా. ‘ఆమిర్‌ ఖాన్‌ చేసే సినిమాల్లో, పాత్రల్లో ఒక చాలెంజ్‌ ఉంటుంది. సమాజంలో ఉన్న చాలెంజ్‌ ఉంటుంది. కొత్త దనం తేవాలన్న చాలెంజ్‌ ఉంటుంది. ఇక ప్రియాంకా చోప్రా అంటారా.. నా ఫేవరేట్‌. 2000లో తనూ ‘మిస్‌ వరల్డ్‌’గా దేశానికి వన్నె తెచ్చింది. 17 ఏళ్ల తర్వాతిప్పుడు నేనూ ఆమెను... ఫాలో ఫాలో ఫాలో ఫాలో..’ అంది మానుషీ.

మరిన్ని వార్తలు