మంచి జీవనశైలితో చాలా క్యాన్సర్లు దూరం...

16 Sep, 2016 23:20 IST|Sakshi
మంచి జీవనశైలితో చాలా క్యాన్సర్లు దూరం...

క్రమబద్ధమైన జీవనశైలి ఆరోగ్యాన్ని ఇస్తుందనే విషయం తెలిసిందే. అయితే ఆరోగ్యకరమైన ఆ జీవనశైలితో క్యాన్సర్లను సమర్థంగా నివారించవచ్చునని  మరోమారు తాజాగా నిరూపితమైంది. దాదాపు లక్షా నలభై వేల మందికి పైగా వ్యక్తులను చాలా నిశితంగా పరిశీలించాక ఈ విషయం మరింతగా స్పష్టమైంది. రోజూ మంచి సమతుల ఆహారంతో తీసుకోవడం, పొగతాగే అలవాటును పూర్తిగా మానేయడంతో పాటు వారానికి కనీసం ఐదు రోజులైనా రోజూ అరగంట సేపు వ్యాయామం చేసే వారిలో ఊపిరితిత్తులు, పెద్దపేగులు, ప్యాంక్రియాస్, మూత్రపిండాలు, గొంతు, కాలేయం, రొమ్ము, ప్రోస్టేట్‌తో పాటు అనేక రకాల క్యాన్సర్లు నివారితమవుతాయని తాజాగా నిర్వహించిన ఒక అధ్యయనంలో తేటతెల్లమైంది. హార్వర్డ్ యూనివర్సిటీ నిర్వహించిన ఈ అధ్యయన ఫలితాలు జామా ఆంకాలజీ అనే హెల్త్ మ్యాగజైన్‌లో ప్రచురితమయ్యాయి.

మరిన్ని వార్తలు