గుండె ఆరోగ్యానికి ధ్యానం

23 Dec, 2015 23:59 IST|Sakshi
గుండె ఆరోగ్యానికి ధ్యానం

గురుబోధ
 
రక్త ప్రసరణ అల్లకల్లోలంగా ఉండటం సరికాదు. అలాగే స్తబ్దుగా ఉండటం కూడా సరికాదు. రక్త ప్రసరణ ్రపశాంతంగా హాయిగా ఉండాలి. అప్పుడే గుండెకు మంచిది. మెడిటేషన్ ఈజ్ డెరైక్ట్‌లీ కనెక్టెడ్ విత్ హార్ట్. స్ట్రెస్‌లో ఉన్నప్పుడు దేహం టాక్సిన్స్‌ని విడుదల చేస్తుంది. ఈ మలినాలు గుండెకు భారమవుతాయి.

ధ్యానంలో ఉన్నప్పుడు మంచి హార్మోన్లన్నీ విడుదలవుతాయి. ఇవి గుండెకు మేలు చేస్తాయి. ధ్యానం అంటే ప్రేమగా, కరుణగా ఉంటూ దైవాన్ని నీలోకి తీసుకోవడమే. అప్పుడు శరీరంలోని అన్ని అంగాలు స్థిమితంగా సమన్వయంతో పని చేస్తాయి. అప్పుడు ఆటోమేటిక్‌గా గుండె ఆరోగ్యం బ్రహ్మాండంగా మెరుగు పడుతుంది.
 - స్వామి మైత్రేయ
 
 
 

మరిన్ని వార్తలు