మళ్లీ వెండితెరపై?

30 Jun, 2015 23:06 IST|Sakshi
మళ్లీ వెండితెరపై?

గాసిప్
శ్రీదేవి, మాధురి దీక్షిత్‌లలాగే మీనాక్షి శేషాద్రి కూడా మళ్లీ వెండితెరపై కనిపించ నుందా? ‘గాయల్’ (1990) సినిమా  సీక్వెల్‌లో ఆమె ముఖ్య పాత్ర పోషించ నుందట. ‘హీరో’ ‘మేరీ జంగ్’ ‘షెహన్‌షా’  ‘దామిని’ మొదలైన  సినిమాలతో బాలీవుడ్‌లో చక్కని గుర్తింపు తెచ్చుకుంది శేషాద్రి. 1995లో  ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ హరీష్ మైసూర్‌తో  వివాహమయ్యాక  భర్తతో పాటు అమెరికాకు వెళ్లి  సినిమాలకు  దూరమయ్యింది.  డల్లాస్‌లో ‘చెరిష్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డ్యాన్స్’ పేరుతో డ్యాన్స్ స్కూల్‌ను కూడా ప్రారంభించింది.
మీనాక్షి శేషాద్రి మళ్లీ బాలీవుడ్‌లో నటించనుంది అనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నప్పటికీ ఆమె మాత్రం జవాబు స్పష్టంగా చెప్పడం లేదు.
‘‘ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. చర్చలు జరుగుతున్నాయి’’ అంటుంది.

పైకి అలా అంటున్నప్పటికీ, బాలీవుడ్‌లో పునఃప్రవేశానికి తగిన కథల కోసం వెదుకుతుందనేది ఆ నోటా ఈ నోటా వినిపిస్తుంది.
‘‘అక్కడి వాతావరణంలో ఇమిడిపోవడం కాస్త కష్టంగానే ఉంది’’ అని అమెరికా గురించి ఒకప్పుడు తన మనసులో మాట చెప్పింది మీనాక్షి. కుటుంబంతో కలిసి ఇండియాలో స్థిరపడడానికి ఆమె ఆసక్తి చూపుతుందా? అందులో భాగంగానే బాలీవుడ్ సినిమాల్లో నటించనుందా? వేచి చూద్దాం!

మరిన్ని వార్తలు