-

టీ షర్ట్స్‌తో ఆఫీస్‌కు వస్తే..

8 Jul, 2018 18:46 IST|Sakshi

లండన్‌ : ఆఫీస్‌ అనగానే సూటూ, బూటూ, టైతో  బయలుదేరే వారు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిందే..టై ధరించడంతో మెదడుకు రక్త సరఫరా ఇతరులతో పోలిస్తే 7.5 శాతం తక్కువగా ఉన్నట్టు జర్మన్‌ పరిశోధకుల అథ్యయనంలో వెల్లడైంది. ఆఫీస్‌కు ట్రెడిషనల్‌ వేర్‌ కన్నా టీ షర్ట్స్‌ ధరించి వచ్చేవారే మెరుగ్గా పనిచేస్తున్నట్టు అథ్యయనం సూచించింది.

సౌకర్యవంతమైన దుస్తులతోనే ఉద్యోగులు మంచి సామర్థ్యం కనబరుస్తారని తేలింది. జర్మనీ పరిశోధకులు 30 మంది ఎగ్జిక్యూటివ్‌లపై జరిపిన ఎంఆర్‌ఐ స్కాన్‌లో వారి మెదడుకు రక్త సరఫరా టైలు ధరించని వారితో పోలిస్తే తక్కువగా ఉన్నట్టు  వెల్లడైంది. ఇది ఆయా ఉద్యోగుల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని అథ్యయనం హెచ్చరించింది.

టైలతో కళ్లపై ఒత్తిడి పెరుగుతుందని గతంలోనూ పలు అథ్యయనాలు హెచ్చరించాయి. శరీరంలోని అవయవాలు చురుకుగా పనిచేసేందుకు అవసరమైన సంకేతాలు పంపేందుకు మెదడుకు నిరంతరాయంగా రక్త సరఫరా అత్యంత కీలకం. అథ్యయన వివరాలు జర్నల్‌ స్ర్టింగర్‌లో ప్రచురితమయ్యాయి.

మరిన్ని వార్తలు