నిద్రే చెలిమి కలిమి

21 Mar, 2018 00:08 IST|Sakshi

న్యూస్‌ 

ఒత్తిడి, కుంగుబాటు, ఆందోళన వంటి మానసిక సమస్యలు నిద్రలేమికి దారితీస్తాయనే సంగతి తెలిసిందే. అయితే, నిద్రలేమి వల్ల మానసిక సమస్యలు తలెత్తుతాయని తాజా పరిశోధనలు చెబుతున్నాయి.స్త్రీలైనా, పురుషులైనా వయోజనులైన వారికి ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరి అని, నిద్ర అంతకంటే తక్కువ అయితే మానసిక సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

తరచుగా నిద్రకు అంతరాయం ఏర్పడటం, తగినంత నిద్ర పట్టకపోవడం లేదా ఎక్కువసేపు మెలకువగా ఉండాల్సిన పరిస్థితులు తలెత్తడం వంటివి దీర్ఘకాలం కొనసాగితే మానసిక కుంగుబాటు, ఆందోళన తలెత్తుతాయని బింగ్‌హామ్టన్‌ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ మెరెడిత్‌ కోలెస్‌ చెబుతున్నారు. నిద్ర తగినంతగా లేనివారిని ప్రతికూల భావనలు వెంటాడుతాయని, ఇలాంటి పరిస్థితి దీర్ఘకాలం కొనసాగినట్లయితే తీవ్రమైన మానసిక సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

మరిన్ని వార్తలు