అమెరికా గుజ్జు తీస్తున్నారు

3 Aug, 2019 07:49 IST|Sakshi
‘ఇరోస్‌ నౌ’లో స్ట్రీమింగ్‌ అవుతున్న ‘మెట్రో పార్క్‌’ సిరీస్‌లోని పాత్రలు

వెబ్‌ఫ్లిక్స్‌

పండులో బాగా తీయగా ఉండేది గుజ్జేమరి! అంత తీయగా. అంత చాకచాక్యంగా బిజినెస్‌ నడుపుతారు మన గుజరాతీయులు! యూఎన్‌ గుర్తించిన 190 ప్రపంచ దేశాల్లోని 129 దేశాల్లో గుజ్జు తీస్తున్నారు!
సరదాగా.. కాలక్షేపంగా ‘‘మెట్రో పార్క్‌’’ చూసినా.. వాళ్లలోని  తెగువ, ఎంట్రపెన్యూర్‌షిప్‌ అర్థమవుతాయి! శభాష్‌ గుజరాతీస్‌!!

‘‘గుజరాత్‌ నుంచి గుజరాతీని ప్రపంచం లో ఎక్కడికైనా తీసుకెళ్లగలం.. కాని గుజరాతీలోంచి గుజరాత్‌ను వేరు చేయడం అసాధ్యం (You can take gujrati out of Gujrat but you can't take Gujrat out of Gujrati)'' అనేది గుజ్జూస్‌నుద్దేశించి వాడుకలో ఉన్న నానుడి. ఈ విషయం  ఎరోస్‌నౌలో స్ట్రీమ్‌  అవుతున్న  ‘‘మెట్రో పార్క్‌’’ అనే సిరీస్‌ చూస్తే  కరెక్ట్‌ అనిపిస్తుంది. ఈ వారం వెబ్‌ఫ్లిక్స్‌కి స్టోరీ ప్లే ఆ కథే!

అమెరికా.. న్యూజెర్సీలోని మెట్రో పార్క్‌లో కల్పేష్‌ పటేల్‌ (రణ్‌వీర్‌ షోరే), పాయల్‌ పటేల్‌ (పూర్బీ జోషీ) భార్యాభర్తలు. వాళ్లకు టీన్స్‌లో ఉన్న ఇద్దరు పిల్లలు.. పంకజ్, మున్నీ. డబ్బు సంపాదనే ధ్యేయంగా ఉన్న కల్పేష్‌ ‘‘పే అండ్‌ రన్‌’’ అనే అమెరికన్‌ కన్వీనియెన్సెస్‌ స్టోర్‌ ఒకటి నడిపిస్తూంటాడు. పాయల్‌ బ్యూటీ పార్లర్‌ రన్‌ చేస్తూంటుంది.

ఎపిసోడ్‌ 1.. న్యూ బిగినింగ్స్‌..
పాయల్‌ చెల్లెలు కింజల్‌ ప్రెగ్నెంట్‌. మంచికి, చెడుకి అక్క తోడుగా ఉంటుందని తన భర్త కణ్ణన్‌తో కలిసి న్యూయార్క్‌ సిటీ నుంచి మెట్రో పార్క్‌కు మారుతారు. కణ్ణన్‌ తమిళియన్‌. గృహప్రవేశ కార్యక్రమానికి సౌత్‌ ఇండియన్‌ పురోహితుడినే పిలవాలని పట్టుబట్టి పిలుస్తాడు. చేతిలో ట్యాబ్‌తో ప్రత్యక్షమవుతాడు ఆ పూజారి. ఇకో పూజ చేస్తానంటూ ట్యాబ్‌ ఆన్‌ చేసి మంత్రాలు చదువుతూంటాడు. ధూపదీపాలను వెలిగించాలి అన్నప్పుడు ట్యాబ్‌లో దీపాలు, అగరుబత్తీలు డిస్‌ప్లే అవుతాయి. వాటిని వీళ్లు టచ్‌ చేయగానే వెలుగుతాయి. అలాగే నైవేద్యానికి అరటిపళ్లు డిస్‌ప్లే అవుతాయి. టచ్‌ చేయగానే దేవుడికి ఆరగింపు అయిపోతుంది. టెంకాయ అంతే టచ్‌ చేయగానే రెండుగా పగులుతుంది. అలా హౌజ్‌వార్మింగ్‌ సెర్మనీ కానిచ్చి లంచ్‌కు ‘ఇండియన్‌ రెస్టారెంట్‌’ నుంచి పిజ్జా తెప్పించుకుని గృహప్రవేశం విందు పూర్తి చేసేస్తారు.

ఎపిసోడ్‌ 2.. ది అసిస్టెంట్‌..
తన స్టోర్‌లో కస్టమర్స్‌ని ఆకట్టుకునేలా మాట్లాడే అసిస్టెంట్ల వేటలో పడ్తాడు కల్పేష్‌. ఒకరోజు సూటు, బూటు వేసుకొని చేతిలో ఫైల్‌తో స్టోర్‌లో అడుగుపెడ్తాడు దేశీ యువకుడు. అతణ్ణి చూసి ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ అనుకొని మనవాడే అని సంబరపడిపోతూ సాదరంగా ఆహ్వానిస్తాడు కల్పేష్‌. అతను స్టోర్‌లోని సరుకులను చూపిస్తుంటే అర్థంకాని ఆ దేశీ యువకుడు తనను పరిచయం చేసుకుంటాడు తన పేరు బిట్టూ (పితోభాష్‌ త్రిపాఠీ) అని, బిహార్‌ నుంచి వచ్చానని.. ఉద్యోగం కోసం తిరుగుతున్నానని. ‘‘ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ కాదన్నమాట’’ అని సణుక్కుంటూ ఆ యువకుడిని ఇంటర్‌వ్యూ చేస్తాడు. మెచ్చి అసిస్టెంట్‌ ఉద్యోగమూ ఇచ్చేస్తాడు. పినాసితనంతో సరుకులను ఆదా చేయడంలో, కస్టమర్స్‌ను మాటల్లో పెట్టి సేల్స్‌ పెరిగేలా చేయడంలో, ఓపిక లేని అమెరికన్లు ‘కీప్‌ ది చేంజ్‌’ అంటూ వెళ్లిపోయేదాకా చిల్లర కోసం గల్లాలో వెదికినట్టు యాక్షన్‌ చేయడంలో బిట్టూకి శిక్షణ కూడా ఇస్తాడు. నెల తిరిగేసరికి కల్పేష్‌ను మించి తయారవుతాడు బిట్టూ ఫ్రమ్‌ బిహార్‌.

ఎపిసోడ్‌ 3.. కల్పేష్‌ స్టడీస్‌..
 ‘‘అమెరికాలో కుక్క పిల్ల దగ్గర్నుంచి మనిషి దాకా.. చెంచా నుంచి స్విమ్మింగ్‌ పూల్‌ దాకా అన్నిటì.æకీ ఇన్సూరెన్సే. ఆ వ్యాపారంలోకి దిగితే లాభాలే లాభాలే’’ అంటూ ఇన్సూరెన్స్‌ ఏజెంట్‌గా పనిచేస్తున్న ఒక ఫ్రెండ్‌ ఇచ్చిన సలహా వింటాడు కల్పేష్‌. సైడ్‌ బిజినెస్‌గా తనూ ఇన్సూరెన్స్‌ రంగంలోకి దిగాలని డిసైడ్‌ అయిపోతాడు. ఏజెంట్‌గా సర్టిఫికెట్‌ పొందాలంటే అందుకు సంబంధించిన పరీక్ష రాయాలి. రాత్రింబవళ్లు కష్టపడి చదివి పాస్‌ మార్కులు తెచ్చుకుంటాడు. ‘‘సైన్‌ అండ్‌ స్మైల్‌’’ అని ఏజెన్సీకి పేరు పెట్టి బీమా వ్యాపారం మొదలుపెడ్తాడు.

ఎపిసోడ్‌ 4.. గెరిల్లా మార్కెటింగ్‌..
కల్పేష్‌ ఊహించుకున్నట్టుగా బీమా వ్యాపారం పుంజుకోదు. మళ్లీ పాత స్నేహితుడి దగ్గరకు వెళ్తాడు. గెరిల్లా మార్కెటింగ్‌ చేయమని అడ్వయిజ్‌ ఇస్తాడు ఫ్రెండ్‌. ఆ మరుసటి రోజే స్టార్ట్‌ చేస్తాడు. బిట్టూకి కెమెరా ఇచ్చి రోడ్ల మీద జనాలున్న చోటికి, కార్‌ పార్కింగ్‌లకు వెళ్లి.. ఇన్సూరెన్స్‌ గురించి చెప్తూ వీడియో తీయించుకుంటాడు కల్పేష్‌. ఆ వీడియోను ఇండియన్‌ సినిమాలు ప్రదర్శిస్తున్న చోట్ల, ఇండియన్‌ డిష్‌ చానెల్స్‌లో యాడ్‌గా వేయిస్తాడు. అట్లా అతని వ్యాపారం పుంజుకోకపోయినా.. ‘‘సైన్‌ అండ్‌ స్మైల్‌ .. శాటిస్‌ఫ్యాక్షన్‌ గ్యారెంటీడ్‌ అండ్‌ డెఫినెట్లీ’’ అనే తన పంచ్‌లైన్‌తో గుజరాతీ కమ్యూనిటీలో ఒక జోకర్‌గా మాత్రం పాపులర్‌ అవుతాడు కల్పేష్‌ పటేల్‌.

ఎపిసోడ్‌ 5.. కరౌకే నైట్స్‌..
 పైసా పైసా లెక్క చూసే భర్త పిసినారి తనమంటే చిరాకేసిన పాయల్‌.. పైసా కాదు ప్యాషన్‌ ఉండాలంటూ భర్తను దెప్పుతుంటుంది. పట్టుదలకు పోయిన కల్పేష్‌ తన ప్యాషన్‌ ఏంటో చూపిస్తానని.. న్యూజెర్సీలోని సేల్‌ యార్డ్‌ (చోర్‌ బజార్‌ లాంటిది) కి వెళ్లి.. గీచిగీచి బేరమాడి కరౌకే మ్యూజిక్‌ సెట్‌ కొనుక్కొస్తాడు. తెల్లవారి తన ప్రాక్టీస్‌తోనే ఇంట్లో వాళ్లను నిద్రలేపుతాడు. ఆ స్వరానికి భార్య, పిల్లలు జడుసుకుంటారు. అయినా వెనక్కి తగ్గడు కల్పేష్‌. పైగా ఒక వీకెండ్‌ ఇంట్లోనే డిస్కో నైట్‌ అరేంజ్‌ చేస్తాడు. చుట్టుపక్కల ఉన్న గుజ్జూస్‌ని పిలుస్తాడు. వాళ్లంతా మైకాసురులు అవుతారు. భరించలేని పాయల్‌ పోలీసులకు ఇన్‌ఫామ్‌ చేస్తుంది భర్తకు తెలియకుండా. ‘‘డిస్టర్బెన్స్‌ అవుతోందని నైబర్స్‌ కంప్లయింట్‌ చేశారు’’ అంటూ పోలీసులు వచ్చి పార్టీ క్లోజ్‌ చేయిస్తాడు. నైబర్స్‌ అంతా ఇక్కడే ఉండగా కంప్లయింట్‌ ఎవరిచ్చారబ్బా అని అనుకుంటూ భార్య వైపు అనుమానంగా చూస్తాడు కల్పేష్‌.

ఎపిసోడ్‌ 6...యూనీసెక్స్‌..
తన ‘‘ఫర్‌ లేడీస్‌ ఓన్లీ’ బ్యూటీపార్లర్‌ను యూనీసెక్స్‌ పార్లర్‌గా మార్చేస్తుంది పాయల్‌. నిజానికి మగవాళ్లకు సంబంధించిన బ్యూటీ టిప్స్, హెయిర్‌ కటింగ్స్‌ ఏవీ ఆమెకు రావు. తనకు వచ్చినట్టు హెయిర్‌ కట్‌ చేసి ‘‘మిమ్మల్ని ఇలా తయారుచేశా... ఎంత హ్యాండ్‌సమ్‌గా కనిపిస్తున్నారో’’ అంటూ బాలీవుడ్‌ హీరోల ఫోటోలు చూపిస్తూ యూనీసెక్స్‌ పార్లర్‌ను మేనేజ్‌ చేస్తూంటుంది పాయల్‌.

ఎపిసోడ్‌ 7..డైట్స్‌ అండ్‌ గాడ్జెట్స్‌
కణ్ణన్‌కు గాడ్జెట్స్‌ పిచ్చి. ఇంట్లో క్లీనింగ్‌కి రోబోల్లాంటి రిమోట్‌ కంట్రోల్డ్‌ మెషీన్‌ను తెస్తాడు. కాని దాన్ని ఆపరేట్‌ చేయడం కన్నా స్వతహాగా పనిచేసుకోవడమే బెటర్‌ అని ప్రాక్టికల్‌గా అర్థమవుతుంది కింజల్‌కు. అందుకే ఆ పని కణ్ణన్‌కే అప్పజెప్పుతుంది. ఇంకోవైపు కుక్కల వల్ల ఎలర్జీతో విపరీతంగా జలుబు చేస్తుంది కల్పేష్‌కి. హాస్పిటల్‌కి వెళితే టూడీ ఎకోతో సహా టెస్ట్‌లన్నీ చేయిస్తారు. అందులో కొలెస్ట్రాల్, ట్రై గ్లిసరైడ్స్‌ ఎక్కువున్నట్టు తేలుతుంది. ఎప్పటినుంచో జ్యూస్‌ గ్రైండర్‌ కొనాలనే ఆలోచనలో ఉన్న పాయల్‌.. ఇదే కరెక్ట్‌ సమయమని పావులు కదుపుతుంది. జ్యూస్‌ డైట్‌తో కొలెస్ట్రాల్, వెయిట్‌ను కంట్రోల్‌ చేసుకోవచ్చని, ఇద్దరం డైట్‌ స్టార్ట్‌ చేద్దామని కల్పేష్‌ను ఒప్పించి గ్రైండర్‌ కొనిపిస్తుంది. ఒక వారం బాగానే సాగుతుంది డైట్‌. తర్వాత ఇద్దరికీ నీరసం మొదలవుతుంది. జ్యూస్‌ చేయడం కంటే ఆ గ్రైండర్‌ను శుభ్రం చేయడమే కష్టమని ఆచరణలో తెలుసుకుంటుంది పాయల్‌. ఈ లోపు కుక్కల అలర్జీ నుంచి బాస్‌ను కాపాడ్డానికి ఒక మెషీన్‌ను తెచ్చి షాప్‌లో అమరుస్తాడు బిట్టూ. పెట్‌ డాగ్స్‌తో ఎవరైనా షాప్‌లోకి వస్తే ఆ మెషీన్‌ వింత శబ్దాలను చేస్తుంది. ఆ సౌండ్స్‌కి కుక్కలు పారిపోతాయి. అయితే ఆ శబ్దాలు కుక్కలకు మాత్రమే వినపడ్తాయి. కాని ఈ మెషీన్‌ వల్ల ఓ కస్టమర్‌ దగ్గర దొరికిపోతారు కల్పేష్‌ అండ్‌ బిట్టూ.

ఎపిసోడ్‌ 8.. ప్రెగ్నెన్సీ క్లాసెస్‌..
కింజల్‌కు డెలివరీ టైమ్‌ దగ్గరపడ్తూంటుంది. బేబీ పుట్టాక ఎలా సంరక్షించాలో తెలుసుకోవడానికి ప్రెగ్నెన్సీ క్లాసెస్‌కు అటెండ్‌ అవుతుంటారు కింజల్, కణ్ణన్‌. ఆ క్లాసెస్‌ ఏవీ అర్థంకాని కణ్ణన్‌ వాళ్లు పెట్టే ప్రతి పరీక్షలో ఫెయిల్‌ అవుతుంటాడు. పక్కనున్న మరో ప్రెగ్నెంట్‌ లేడీ హజ్బెండ్‌ను ఎగ్జాంపుల్‌గా చూపిస్తూ నేర్చుకోమంటుంది టీచర్‌. కింజల్‌ కూడా అతణ్ణి మెచ్చుకొనేసరికి ఉడికిపోతుంటాడు కణ్ణన్‌.

ఎపిసోడ్‌ 9.. హౌజింగ్‌ ఫాలింగ్‌ ఎపార్ట్‌..
కల్పేష్‌ పిసినారితనం మళ్లీ మ్యాటర్‌ అవుతుంది పాయల్‌కు. ఇంట్లో కాలింగ్‌ బెల్‌ నుంచి బాత్రూమ్స్‌లో ఫ్లష్‌దాకా అన్నీ రిపేరింగ్‌లో ఉంటాయి. డబ్బుకి కక్కుర్తి పడి ప్లంబర్‌ను పిలిపించకుండా అన్నిటికీ ప్లాస్టర్లు వేసి నెట్టుకొస్తుంటాడు కల్పేష్‌. సహనం చచ్చిపోయిన పాయల్‌ గొడవ పెట్టేసరికి అతి చవగ్గా దొరికిన ఫ్రెంచ్‌ ప్లంబర్‌ను పట్టుకొస్తారు కల్పేష్, బిట్టూ. ఆ ఫ్రెంచ్‌ ప్లంబర్‌ ఫ్రెంచ్‌ యాసలో ఇంగ్లిష్‌ మాట్లాడుతూ గంటల చొప్పున డాలర్లను లెక్కగట్టి ముప్పై డాలర్లలో అయిపోయే పనికి వందల డాలర్ల బిల్లు పంపిస్తాడు. గతుక్కుమంటాడు కల్పేష్‌. ఈలోపు కింజల్‌కు నొప్పులు స్టార్టవుతాయి. అంతకుముందు స్కానింగ్‌లో ఆడపిల్ల అని చెప్పిన డాక్టర్లు నొప్పుల సమయంలో స్కాన్‌ చేసి బేబీ చేంజ్‌ అయిందంటారు. ఖంగుతిన్న కపుల్‌ను చూసి.. ‘‘ఏం లేదు.. అంతకుముందు బేబీ గర్ల్‌ అనుకున్నాం.. కాని కాదు పుట్టబోయేది బేబీ బాయ్‌’’ అని వివరణ ఇస్తారు డాక్టర్లు. ఇలాంటి షాక్‌లు, వింతలు అన్నిటినీ అధిగమించి మగబిడ్డను కంటుంది కింజల్‌. ఇక్కడితో మెట్రో పార్క్‌ ఎండ్‌.

డాలర్లను రూపాయిల్లో లెక్కించుకుంటూ ఖర్చులకు గుండెను బాదుకునే సగటు భారతీయ మనస్తత్వం, అమెరికా అయినా అంతరిక్షమైనా ఇండియనైజ్‌ చేయగల మన చాకచక్యం వంటి లక్షణాలతో ఈ తొమ్మిది ఎపిసోడ్లు ఆద్యంతమూ హాస్యప్రధానంగా సాగుతాయి. చిన్న నుంచి పెద్ద వరకూ అందరూ ఎంజాయ్‌ చేయగల సిరీస్‌ మెట్రో పార్క్‌.– సరస్వతి రమ

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రకృతిసిద్ధంగా శరీర సౌందర్యం

ప్రకృతి హితమే రక్షగా...

పోస్టర్‌ల మహాసముద్రం

ఆమెకు అండగా ‘షీ టీమ్‌’

శుభప్రద శ్రావణం

అరచేతిలో ‘e’ జ్ఞానం

అమ్మ పాలు... ఎంతో మేలు

వరుసగా గర్భస్రావాలు.. సంతానభాగ్యం ఉందా?

యాంటీ డిసీజ్‌ ఆహారం

తండ్రి లేడు... అమ్మ టైలర్‌

పశ్చాత్తాప దీపం

ఆ కాపురంపై మీ కామెంట్‌?

నవ లావణ్యం

పిడుగు నుంచి తప్పించుకోవచ్చు.. 

పాప ముఖం మీద మచ్చలు.. తగ్గడం ఎలా? 

స్త్రీ విముక్తి చేతనం 

న్యూస్‌ రీడర్‌ నుంచి సీరియల్‌ నటిగా! 

ఏ జో హై జిందగీ..ఫ్యామిలీ సర్కస్‌

గుండె రంధ్రం నుంచి చూస్తే...

శివుడి ప్రీతి కోసం కావడి వ్రతం

అల్లంతో హైబీపీకి కళ్లెం!

క్షీర చరిత్ర

కందకాలతో జలసిరి!

ఆకుల దాణా అదరహో!

హెయిర్‌ కేర్‌

ఎవరు చెబితేనేమిటి?

వెరవని ధీరత్వం

భార్య, భర్త మధ్యలో ఆమె!

రెడ్‌ వైన్‌తో ఆ వ్యాధులకు చెక్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ద్విపాత్రాభినయం

నటుడు విశాల్‌కు అరెస్ట్‌ వారెంట్‌

అలా చేశాకే అవకాశమిచ్చారు!

గుణ అనే పిలుస్తారు

తుగ్లక్‌ దర్బార్‌లోకి ఎంట్రీ

వసూళ్ల వర్షం పడుతోంది