అర్ధరాత్రి సూర్యోదయం

8 May, 2014 22:37 IST|Sakshi
అర్ధరాత్రి సూర్యోదయం

విదేశాలలో...
 
‘ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ సన్’ అని పేరున్న నార్వేలోనిదీ సూర్యోదయ దృశ్యం. ఇక్కడ మే నెల నుండి ఆగష్టు వరకు రాత్రి 11 గం.కి కూడా పట్టపగలులా ఉంటుంది. పన్నెండు గంటల తర్వాత చీకటి పడినట్టే పడి.. ఆ వెంటనే సూర్యోదయమౌతుంది. ఒక్కోసారి 4 గంటలకు సూర్యోదయం అవుతుంది. ఆ విధంగా వేసవిలో 4 గంటలే చీకటిగా ఉంటే, జూన్ జులైలో రెండు గంటలు మాత్రమే చీకటి. అక్టోబర్ నుండి ఈ దృశ్యం పూర్తిగా మారుపోతుంది.

రోజులో 3-4 గంటలు మాత్రమే వెలుతురు. ఉత్తర ఐరోపాకు చెందిన నార్వే స్కాండినేవియా ద్వీపకల్పం పశ్చిమ ప్రాంతంలో ఉంది. ధ్రువప్రాంతం కావడంతో ఇక్కడి వాతావరణ పరిస్థితులు రోజుకు మూడు, నాలుగు సార్లు మారుతూ ఉంటాయి. అప్పుడే ఎండ, అప్పుడే చలి, ఆ వెంటనే వాన... ఇలా ఒకేరోజు మూడు రుతువులను చూడవచ్చు.

ఉత్తర నార్వేలో జూన్ 21, దక్షిణ నార్వేలో డిసెంబర్ 22న రోజంతా ఎండకాస్తూనే ఉంటుంది. ధృవప్రాంతం కావడంతో సూర్యకిరణాల వెలుగులు ఎరుపు, పసుపు, నీలం, ఆకుపచ్చ.. ఇలా హరివిల్లు రంగులు దర్శనమిస్తుంటాయి.
 

మరిన్ని వార్తలు