మిలీనియల్స్‌కు రక్తపోటు ముప్పు

9 Sep, 2018 10:56 IST|Sakshi

లండన్‌ : ఆధునిక ప్రపంచాన్ని ముందుకు నడిపించాల్సిన మిలీనియల్స్‌ ఒత్తిడి ఊబిలో చిత్తవుతున్నారని తాజా అథ్యయనం హెచ్చరించింది. 18 నుంచి 34 ఏళ్ల మధ్యన మిలీనియల్స్‌గా పిలవబడే ఈతరం యువత తీవ్ర ఒత్తడితో సతమతమవుతూ అధిక రక్తపోటు బారిన పడే ప్రమాదం ఉందని తేల్చిచెప్పారు.మిలీనియల్స్‌లో 96 శాతం మంది ఒత్తిడిలో కూరుకుపోయారని, వారితో పోలిస్తే 55 ఏళ్లు పైబడిన వారిలో కేవలం 66 శాతం మందే తాము ఒత్తిడికి గురవుతున్నామని చెబుతున్నారని సర్వేలో వెల్లడైందని ప్రముఖ ఐర్లాండ్‌ వైద్యురాలు, టీవీ వ్యాఖ్యాత డాక్టర్‌​ పిక్సీ మెకెనా వెల్లడించారు.

రక్తపోటుకు పోషకాహార లోపం, మద్యపానం వంటి కారణాలతో పాటు ఒత్తిడి ప్రధాన కారణమని మెకెనా చెప్పుకొచ్చారు. రక్తపోటు ఇక ఎంతమాత్రం వయసుపైబడిన వారిలో కనిపించే వ్యాధి కానేకాదని తమ అథ్యయనంలో వెల్లడైందన్నారు.

వ్యాయామం లేకపోవడం, ఒత్తిడి, మద్యపానం, అధిక బరువు, అధికంగా ఉప్పు తీసుకోవడం వంటి కారణాలతో మిలీనియల్స్‌లో అధిక రక్తపోటు రిస్క్‌ అధికంగా ఉందని చెప్పారు. తాము నిర్వహించిన సర్వేలో బాధ్యతలు మీదపడుతున్నప్పటికీ మధ్యవయస్కుల్లో ఒత్తిడి స్ధాయి తక్కువగా ఉన్నట్టు వెల్లడైందన్నారు.

మరిన్ని వార్తలు