అద్దమైన ప్రకృతి

26 Oct, 2018 01:54 IST|Sakshi

పూలు తాజాగా ఒక పూట లేదంటే ఒక రోజు ఉంటాయి. ఆ తర్వాత వాడి నేలరాలిపోతాయి. పూలను ఫొటోలుగా తీసి దాచుకుంటారు కొందరు. కానీ వాటిని ఆభరణాలుగా మార్చి, అలంకరించుకోవచ్చు అంటోంది హైదరాబాద్‌కి చెందిన నవ్యశ్రీ మండవ. పూలను అద్దాలలో పొందుపరిచి ఆభరణంగా రూపుకడుతోంది.

గ్లాస్‌ లిక్విడ్‌
గులాబీ, మల్లె, చామంతి, బంతి.. తాజా పువ్వులను, ఆకులను ఒక ప్రత్యేక పద్ధతిలో 2–3 వారాల పాటు ఎండబెడతారు. గ్లాస్‌ లిక్విడ్‌ని మౌల్డ్‌లో పోసి ఎండిన పువ్వులను అందులో పొందిగ్గా అమర్చి మరికొన్ని రోజులు ఉంచుతారు. దీంతో పువ్వుతో పాటు గట్టిపడిన గాజు అందాన్ని ఆభరణంగా మార్చుతారు. ‘అమెరికాలో ఈ ఆభరణాల తయారీ ఎప్పటి నుంచో ఉంది. ఆన్‌లైన్‌ క్లాసెస్‌ ద్వారా ఈ ఆర్ట్‌ని నేర్చుకొని వీటిని సొంతంగా తయారుచేస్తున్నాను’ అని చెబుతోంది నవ్యశ్రీ.

కాదేదీ అద్దానికి అనర్హం
పువ్వులు ఆకులే కాదు డ్రై ఫ్రూట్స్, కాఫీ గింజలు, టీ పొడి, కలప, పేపర్స్‌.. ఇలాంటి వేటినైనా ప్రకృతిలో ఉన్న ప్రతి అందాన్ని అద్దంలో బంధించవచ్చు. పెండెంట్, ఇయర్‌ రింగ్స్, బ్యాంగిల్, బ్రాస్‌లెట్, చోకర్స్‌ కూడా గాజుతో అందంగా తయారుచేయవచ్చు. పదిలంగా జ్ఞాపకాలని భద్రపరుచుకోవచ్చు. ఆత్మీయులకు వీటిని ప్రేమ కానుకలుగా ఇవ్వచ్చు.
వందల నుంచి వేల రూపాయల వరకు డిజైన్, పరిమాణం బట్టి ధరలు ఉన్నాయి.
www.instagram.com/srushti_collections_official

మరిన్ని వార్తలు