నో అందం.. ఓన్లీ బౌద్ధం

6 Jan, 2018 00:24 IST|Sakshi

మిస్‌ టిబెట్‌ 2018 పోటీలు ఈసారి ఇండియాలో జరగడం లేదు! ‘జరగనివ్వం’ అని సంప్రదాయవాదులు పట్టుపట్టారు. అందుకే  న్యూయార్క్‌కి షిఫ్ట్‌ అవుతున్నాయి. ‘‘బౌద్ధం అంటే ఇన్నర్‌ బ్యూటీ.  పరాయి దేశంలో ఉంటున్నప్పుడు ఆ అంతస్సౌందర్యాన్ని కాపాడుకోవాలి కానీ, ఇలా స్టేజీలు ఎక్కి, ఒళ్లు చూపించి కిరీటాలు పెట్టించుకోవడం ఏంటి?’’ అని హిమాచల్‌ప్రదేశ్‌లోని మెక్లియోడ్‌గంజ్‌లో ఉంటున్న బౌద్ధ పెద్దలు అభ్యంతరం చెబుతున్నారు. మెక్లియోడ్‌గంజ్‌ హిమాచల్‌ ప్రదేశ్‌లో ఉంది. ఎప్పుడూ జరిగే విధంగానే అయితే మిస్‌ టిబెట్‌ 2018 పోటీలు ఇక్కడే జరగాలి. అయితే ఈ పోటీల్లోని బికినీ రౌండ్‌పై ఈసారి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. చైనా వివాదాస్పద భూభాగంలో ఉన్న స్వతంత్రదేశం టిబెట్‌.

పదిహేనేళ్ల నుంచీ మన హిమాచల్‌ప్రదేశ్‌లో మిస్‌ టిబెట్‌ పోటీలు జరుగుతున్నాయి. ప్రవాసంలో ఉన్న టిబెట్‌ మహిళల సాధికారత కోసం అని 2002లో తొలిసారి మిస్‌ టిబెట్‌ పోటీలు మొదలయ్యాయి. అప్పట్నుంచీ అన్ని పోటీలూ హిమాచల్‌ప్రదేశ్‌లోనే జరిగాయి. తొలి ఏడాది ఒకరిద్దరు పోటీ పడ్డారు కానీ, 2003, 2005, 2013 పోటీలలో మరీ ఒక్కరంటే ఒక్కరే అప్లికేషన్‌ పెట్టుకున్నారు!   ఈ ఏడాది అందాల పోటీలకు అప్లయ్‌ చేసుకోడానికి టిబెట్‌ అమ్మాయిలకు మార్చి 31 వరకు గడుపు ఉంది. ఆలోపు పెద్దవాళ్ల మనసు మారితే న్యూయార్క్‌ నుంచి మళ్లీ మెక్లియోడ్‌గంజ్‌కే మిస్‌ టిబెట్‌ ఫైనల్స్‌ షిఫ్ట్‌ అయ్యే అవకాశాలు ఉంటాయి. 

మరిన్ని వార్తలు