కళ్యాణ కళ

25 Jan, 2019 00:23 IST|Sakshi

పెళ్లిళ్ళ సీజన్‌ వచ్చేసింది పట్టు కళ వేడుకలలో ధగధగలాడటానికిసరికొత్తగా ముస్తాబు అవుతోంది.నవతరం లుక్‌లో వచ్చిన మార్పుకుఆధునికత అద్దం పడుతోంది.ఇండోవెస్ట్రన్‌ స్టైల్‌ బ్లౌజ్‌లకు సంప్రదాయ పట్టు జత చేరి రెట్రో కళతో వెలిగిపోతోంది.

షోల్డర్‌ డౌన్, స్లీవ్‌లెస్‌ డిజైనర్‌ బ్లౌజ్‌లతో కంచిపట్టు చీరలకు మోడ్రన్‌ కళ తీసుకురావచ్చు. అంతేకాదు బామ్మలకాలం నాటి శారీస్‌తోనూ వేడుకలో ఆకట్టుకునే కట్టును ఈ తరం ఎంచుకుంటోందనడానికి ఈ మోడల్‌ సిసలైన ఉదాహరణ.

కంచిపట్టు చీరకు ప్లెయిన్‌ బ్లౌజ్‌తోనూ డిఫరెంట్‌ లుక్‌ తీసుకురావచ్చు. బ్యాక్‌ హైనెక్, ఫ్రంట్‌ డీప్‌ నెక్‌ ఉన్న ప్లెయిన్‌ బ్లౌజ్‌కి కాంట్రాస్ట్‌ నెటెడ్‌ కుచ్చులు జత చేస్తే ఇండోవెస్ట్రన్‌ లుక్‌ వచ్చేస్తుంది. 

‘గ్రే కలర్‌ చీరలు వేడుకలో డల్‌గా ఉంటాయి’ అని సందేహించేవారికి గ్రేస్‌ లుక్‌తో చూపులను కట్టడి చేస్తున్నాయి ఈ చీరలు. నెటెడ్‌ బుట్ట చేతుల డిజైనర్‌ బ్లౌజ్‌ ఈ శారీకి అసలైన ఎన్నిక. మెడకు నిండుదనాన్ని తెచ్చే వెడాల్పిటి నెక్లెస్, పొడవాటి హారాలు అదనపు అలంకరణ. 

రెట్రోలుక్‌ ప్రతి వేడుకకూ ఎవర్‌గ్రీన్‌ అలంకరణ అవుతుంది ఈ రోజుల్లో. దానికి కొద్దిపాటి మెళకువలతో చీరలకు కొత్త సింగారాలను అద్దవచ్చు. రౌండ్‌ క్లోజ్డ్‌ నెక్, కుచ్చుల చేతులున్న బ్లౌజ్‌లు పట్టు చీరల అందాన్ని రెట్టింపు చేస్తాయి.  

>
మరిన్ని వార్తలు