ఈ రోజుకు హ్యాపీ.. రేపు ఏంటీ? – జయసుధ

7 Dec, 2019 03:05 IST|Sakshi

దిశ ఘటనలో సత్వర న్యాయం జరిగినందుకు ఈ రోజుకు హ్యాపీగా ఉన్నాం. కానీ రేపు ఏంటనే భయం అందరిలో ఉంది. నిర్భయ ఘటనలో ఏడేళ్లయినా శిక్ష పడలేదు. ‘ఉన్నావ్‌’లో ఏకంగా బాధితురాలిని నడిరోడ్డుపైనే కాల్చేశారు. అసలు మహిళలపై హింసకు కారణమవుతున్న అంశాలపై లోతైన చర్చ, ఆ దిశగా నివారణ చర్యలు తక్షణం చేపట్టాలి. ముఖ్యంగా దేశంలో సగభాగం ఉన్న మహిళలకు ప్రధాని మోదీ ఈ విషయంలో ఏ రకమైన భరోసానిస్తారో స్పష్టం చేయాలి. మహిళలపై హింస నివారణకు కుటుంబం, పాఠశాలల నుండే మొదలు కావాలి. మహిళల ఇబ్బందుల విషయంలో పోలీసుల తీరులో సమూల మార్పు, కోర్టులు సత్వర తీర్పులు వెలువరించే దిశగా అన్ని వ్యవస్థలు పనిచేయాలి. అప్పుడే మహిళలు, కుటుంబాలు రోజూ హ్యాపీగా ఉండే పరిస్థితి ఉంటుంది.

మరిన్ని వార్తలు