వారానికి సరిపడా వెరైటీ పూరీలు..!

6 Jul, 2019 12:33 IST|Sakshi

సోమవారం పూరీ... మంగళవారం పూరీ... బుధవారం పూరీ...గురువారం పూరీ... శుక్రవారం పూరీ... శనివారం పూరీ...ఆదివారం కూడా పూరీనే...మీ దగ్గర మరో రెండు వారాలుంటే ఇంకో రెండు పూరీలు...
మిమ్ము కోరి వస్తున్నాయి మొత్తం తొమ్మిది పూరీలు...మీ బుగ్గలను బూరె బుగ్గలు... కాదు కాదు...పూరీ బుగ్గలను చేసుకోండి.

దహీమేథీపూరీ
కావలసినవి: గోధుమ పిండి – ఒకటిన్నర కప్పులు; పెరుగు – 2 టేబుల్‌ స్పూన్లు; అల్లం + పచ్చి మిర్చి ముద్ద – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా; మెంతి కూర తరుగు – అర కప్పు; కసూరీ మేథీ – ఒక టేబుల్‌ స్పూను; నీళ్లు – తగినంత.

తయారీ: ∙పైన చెప్పిన పదార్థాలను (నూనె తప్పించి) ఒక పాత్రలో వేసి పూరీ పిండి మాదిరిగా కలుపుకోవాలి ∙అర టేబుల్‌ స్పూను నూనె వేసి పిండిని మరోమారు కలపాలి ∙మూత పెట్టి, పది నిమిషాల పాటు పక్కన ఉంచాలి ∙పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి పూరీలుగా ఒత్తుకోవాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, ఒత్తి ఉంచుకున్న పూరీలను అందులో వేసి దోరగా వేయించి పేపర్‌ టవల్‌ మీదకు తీసుకోవాలి.

టొమాటో పూరీ
కావలసినవి: గోధుమ పిండి – ఒక కప్పు;టొమాటోలు – 2; తరిగిన పచ్చి మిర్చి – 3; ఉప్పు – తగినంత; ధనియాల పొడి – ఒక టీ స్పూను; నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా.
తయారీ: ∙టొమాటోలను శుభ్రంగా కడిగిచిన్న చిన్న ముక్కలు చేయాలి ∙టొమాటో ముక్కలకుపచ్చి మిర్చి తరుగు, తగినన్ని నీళ్లు జత చేసి మిక్సీలో వేసిమెత్తగా చేసి, వడకట్టాలి ∙ఒక పాత్రలో గోధుమ పిండి,
ఉప్పు, టొమాటో రసం, ధనియాల పొడి వేసిపూరీ పిండిలా కలపాలి ∙చిన్న చిన్న ఉండలు చేసిపక్కన ఉంచాలి ∙పూరీలా ఒత్తాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఒత్తి ఉంచుకున్న పూరీలను అందులో వేసి దోరగా వేయించిపేపర్‌ టవల్‌ మీదకు తీసుకోవాలి.

నమ్‌కీన్‌తిల్‌ పూరీ
కావలసినవి: గోధుమ పిండి – ఒక కప్పు; నువ్వులు – 2 టేబుల్‌ స్పూన్లు; ఉప్పు – పావు టీ స్పూను; నూనె – ఒక టేబుల్‌ స్పూను + డీప్‌ ఫ్రైకి సరిపడా.
తయారీ: ∙ఒక పాత్రలో గోధుమ పిండి, నువ్వులు, ఉప్పు, కొద్దిగా నూనె వేసి బాగా కలపాలి ∙గోరు వెచ్చని నీళ్లు జత చేసి పూరీ పిండిలా కలుపుకోవాలి ∙చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి ∙పూరీలా ఒత్తుకుని పక్కన ఉంచుకోవాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఒత్తి ఉంచుకున్న పూరీలను నూనెలో వేసి దోరగా వేయించి టవల్‌ మీదకు తీసుకోవాలి.

తీపిగుమ్మడిపూరీ
కావలసినవి: గోధుమ పిండి – 2 కప్పులు; ఇంగువ – పావు టీ స్పూను; తీపి గుమ్మడికాయ తురుము – ఒక కప్పు; బొంబాయి రవ్వ – పావు కప్పు; కొత్తిమీర తరుగు – 2 టేబుల్‌ స్పూన్లు; నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా; పచ్చి మిర్చి ముద్ద – ఒక టీ స్పూను; ధనియాల పొడి – అర టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను; మిరప కారం – అర టీ స్పూను; ఉప్పు – తగినంత
తయారీ: ఒక పాత్రలో గోధుమ పిండి, తగినంత ఉప్పు, మిరప కారం, పసుపు, ధనియాల పొడి, ఇంగువ, పచ్చి మిర్చి పేస్ట్‌ వేసి బాగా కలపాలి ∙కొత్తిమీర తరుగు, బొంబాయి రవ్వ, గుమ్మడి కాయ తురుము, కొద్దిగా నూనె జతచేసి మరోమారు కలపాలి ∙తగినన్ని నీళ్లు జతచేసి పూరీ పిండి మాదిరిగా కలిపి, మూత ఉంచి సుమారు గంట సేపు పక్కన ఉంచాలి ∙చేతికి నూనె పూసుకుని పిండిని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి ∙పూరీలా ఒత్తుకోవాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఒక్కో పూరీని అందులో వేసి దోరగా వేయించి పేపర్‌ టవల్‌ మీదకు తీసుకోవాలి ∙గుమ్మడి గింజలతో అలంకరించి, అందిస్తే రుచిగా ఉంటాయి.

 బనానా పూరీ
కావలసినవి: అరటిపండు గుజ్జు – అర కప్పు; పంచదార – అర కప్పు; బాదం పప్పుల పొడి – 3 టేబుల్‌ స్పూన్లు; బటర్‌ – ఒక టేబుల్‌ స్పూను; ఉప్పు – చిటికెడు ; ఏలకుల పొడి – పావు టీ స్పూను; గోధుమ పిండి – ముప్పావు కప్పు; మైదా పిండి – ముప్పావు కప్పు; కరిగించిన నెయ్యి – ఒక టేబుల్‌ స్పూను; నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా.
తయారీ: ఒక పాత్రలో అరటి పండు గుజ్జు, పంచదార, బాదం పప్పుల పొడి, బటర్, ఉప్పు, ఏలకుల పొడి వేసి బాగా కలపాలి ∙గోధుమ పిండి, మైదా పిండి జత చే సి చేతితో మెత్తగా కలిపి మూత పెట్టి, రెండు గంటలపాటు పక్కన ఉంచాలి ∙చేతికి నూనె లేదా నెయ్యి పూసుకుని కలిపి ఉంచుకున్న పిండిని చిన్న చిన్న ఉండలు చేయాలి ∙ఒక్కో ఉండను పూరీలా గుండ్రంగా ఒత్తాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, వేయించి ఉంచుకున్న పూరీలను ఒక్కొక్కటిగా నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి, పేపర్‌ టవల్‌ మీదకు తీసుకోవాలి.

దాల్‌ పూరీ
కావలసినవి: పెసర పప్పు – 100 గ్రా.; మైదా పిండి – అర కిలో; మిరప కారం – ఒక టీ స్పూను; గరం మసాలా పొడి – ఒక టీ స్పూను; వెల్లుల్లి రెబ్బలు – 2; తరిగిన పచ్చి మిర్చి – 2; నెయ్యి – ఒక టీ స్పూను; ధనియాల పొడి – ఒక టీ స్పూను; ఉల్లి తరుగు – అర కప్పు; ఉప్పు – 2 టీ స్పూన్లు; నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా.

తయారీ: ∙పెసర పప్పును మూడు గంటల పాటు నానబెట్టాక, నీళ్లు ఒంపేయాలి ∙ఒక పాత్రలో కప్పుడు నీళ్లు, పెసర పప్పు వేసి మూత పెట్టి, స్టౌ మీద ఉంచి ఉడికించి (మరీ మెత్తగా ఉడికించకూడదు) దింపి నీరు ఒంపేయాలి ∙ఒక పెద్ద పాత్రలో పెసర పప్పు, మిరప కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి తరుగు, ఉల్లి తరుగు వేసి కలిపి, మిక్సీలో వేసి మెత్తగా చేసి, ఒక పాత్రలోకి తీసుకోవాలి ∙మైదా పిండి జత చేసి పూరీ పిండిలా కలపాలి ∙కొద్దిగా నెయ్యి జత చేసి మరోమారు బాగా కలపాలి ∙చిన్న చిన్న ఉండలు చే సుకోవాలి ∙ఒక్కో ఉండను పూరీలా ఒత్తుకోవాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, ఒత్తి ఉంచుకున్న పూరీలను నూనెలో వేసి, బంగారు రంగులోకి వచ్చేవరకు రెండువైపులా వేయించి పేపర్‌ టవల్‌ మీదకు తీసుకోవాలి.

మిరియాలు జీలకర్రపూరీ
కావలసినవి: గోధుమ పిండి – ఒక కప్పు; మిరియాల పొడి – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; నెయ్యి – ఒక టేబుల్‌ స్పూను; ఉప్పు – తగినంత; నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా.

తయారీ: ∙ఒక పాత్రలో గోధుమ పిండి, మిరియాల పొడి, జీలకర్ర, నెయ్యి, ఉప్పు వేసి బాగా కలపాలి ∙తగినన్ని నీళ్లు జత చేసి పూరీ పిండిలా కలపాలి ∙చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి ∙పూరీలుగా ఒత్తి పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఒక్కో పూరీని అందులో వేసి దోరగా వేయించి పేపర్‌ టవల్‌ మీదకు తీసుకోవాలి.

బీట్‌రూట్‌ పూరీ
కావలసినవి:బీట్‌ రూట్‌ – 1; గోధుమ పిండి – ఒక కప్పు; మిరప కారం – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; ధనియాల పొడి – పావు టీ స్పూను; జీలకర్ర పొడి – పావు టీ స్పూను; నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా.

తయారీ: ∙బీట్‌ రూట్‌ పైన చెక్కు తీసి సన్నగా తురమాలి ∙బాణలిలో నూనె వేసి కాగాక బీట్‌ రూట్‌ వేసి పచ్చి వాసన పోయే వరకు దోరగా వేయించాలి ∙పాత్రలో గోధుమ పిండి, వేయించిన బీట్‌ రూట్‌ తురుము, మిరప కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కలపాలి ∙తగినన్ని నీళ్లు జత చేసి పూరీ పిండిలా కలుపుకోవాలి ∙చిన్న చిన్న ఉండలు చేసి, పూరీలా ఒత్తి పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఒక్కో పూరీని వేసి దోరగా వేయించి పేపర్‌ టవల్‌ మీదకు తీసుకోవాలి.

మసాలాపూరీ
కావలసినవి: గోధుమ పిండి – ఒక కప్పు; నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా; ఉడికించిన బంగాళదుంపలు – 2; ఉప్పు –తగినంత; జీలకర్ర పొడి – పావు టీ స్పూను; ధనియాల పొడి – అర టీ స్పూను; కొత్తిమీర తరుగు – 2 టేబుల్‌ స్పూన్లు; మిరప కారం – ఒక టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను; వాము – పావు టీ స్పూను; బొంబాయి రవ్వ – రెండు టీ స్పూన్లు; నీళ్లు –  తగినన్ని.
తయారీ: ∙ఒక పాత్రలో గోధుమపిండి, ఉప్పు, మిరపకారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, వాము, కొత్తిమీర తరుగు, బొంబాయి రవ్వ వేసి బాగా కలపాలి ∙ఉడికించిన బంగాళదుంపను పిండిలోకి తురమాలి ∙ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి ∙అవసరమనుకుంటే కొద్దిగా నీళ్లు జత చేసి పూరీ పిండి మాదిరిగా కలుపుకోవాలి ∙పైన నూనె వేసి మరోమారు కలిపి మూత ఉంచి, అరగంటసేపు నాననివ్వాలి ∙చేతికి నూనె పూసుకుని, పిండిని ఉండలుగా చేసుకోవాలి ∙పూరీ మాదిరిగా ఒత్తాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఒక్కో పూరీని వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి పేపర్‌ టవల్‌ మీదకు తీసుకోవాలి.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నిర్లవణీకరణకు కొత్త మార్గం!

కార్బన్‌డైయాక్సైడ్‌ను ఆహారంగా మార్చేశారు!

సినిమా టైంలో కలిసిన ‘రోహిత్‌ సహానీ’..

తొలి అమెరికా పెళ్లికొడుకు

బొప్పాయి గుజ్జుతో మేని కాంతి

అభినయ శిల్పం

రోజుకు వెయ్యి లీటర్ల నీటితోనే చేపల సాగు..

'పాడి'తో బతుకు 'పంట'!

సంతృప్తి.. సంతోషం..!

మళ్లీ మురిపి'స్టారు'

‘ప్రేమ’ లేకుండా పోదు

నలుగురు ఓహ్‌ బేబీలు

పక్కింటి ఎండమావి

చీకటికి అలవాటుపడని కళ్లు

పెత్తనం పోయి కర్ర మిగిలింది

ఎత్తయిన సిగ్గరి

యువత. దేశానికి భవిత

బజ్జీ బిర్యానీ.. స్నాకం 'పాకం'

మద్దూరు వడను వదిలేస్తే బాధపడకతప్పదు..

చందమామ నవ్వింది చూడు

ఆఫీస్‌ ఇలా ఉండకూడదు

ప్లాస్టిక్‌ ఇల్లు

సౌరశక్తి ప్లాంట్‌లలో అబూదాబి రికార్డు!

మ్యావ్‌ మ్యావ్‌... ఏమైపోయావ్‌!

మా అమ్మపై ఇన్ని పుకార్లా

చక్కెర చాయ్‌తో క్యాన్సర్‌!

చిన్నారుల కంటి జబ్బులకు చికిత్సాహారం

మేము సైతం అంటున్న యాంకర్లు...

ఒత్తిడి... వంద రోగాల పెట్టు

చేతులకు పాకుతున్న మెడనొప్పి... పరిష్కారం చెప్పండి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

32నామినేషన్లు కొల్లగొట్టిన 'గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌'

నటి అమలాపాల్‌పై ఫిర్యాదు

కోలీవుడ్‌లో కేరాఫ్‌ కంచరపాలెం రీమేక్‌

ఆయన మూడో కన్ను తెరిపించాడు!

బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రేమలో పడలేదు..!

సూర్యకు ఆ హక్కు ఉంది..