-

నాచు పట్టిన ఇల్లు కరెంట్ ఇస్తుంది!

21 Nov, 2015 23:58 IST|Sakshi
నాచు పట్టిన ఇల్లు కరెంట్ ఇస్తుంది!

ఫొటో చూశారుగా... జర్మనీలోని హాంబర్గ్‌లో ఉందీ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్. ఏంటి దీని ప్రత్యేకత? ముందువైపు అద్దాల్లో పచ్చగా కనిపిస్తోందే... అదే! ఏముంది అందులో? పాచి! ఎందుకు? ఆ పాచి ఇంటికి కావాల్సిన కరెంట్ మొత్తాన్ని తయారు చేస్తుంది! అదెలా? అంటున్నారా? పాచి చిన్నసైజు మొక్కలన్న సంగతి మీకు తెలుసుకదా... కాబట్టి ఇవి సూర్యరశ్మిని తీసుకుని ఎదుగుతాయి. ఫలితంగా ఏర్పడే బయోమాస్‌ను రియాక్టర్లోకి చేరిస్తే.. అక్కడ బయోగ్యాస్ ఉత్పత్తి అవుతుంది. దీన్ని ఫ్యుయెల్ సెల్‌లోకి పంపి కరెంట్ ఉత్పత్తి చేస్తారు.

ఈ క్రమంలో విడుదలయ్యే కార్బన్‌డై యాక్సైడ్‌ను పాచి మరింత వేగంగా పెరిగేందుకు ఎరువుగా వాడతారు. మొత్తమ్మీద ఈ అపార్ట్‌మెంట్స్‌లోని అన్ని ఇళ్లకు కావాల్సిన విద్యుత్తు అక్కడికక్కడే ఉత్పత్తి కావడమే కాకుండా... 24 గంటలూ వేడినీళ్లు పొందేందుకూ ఈ పాచినే వాడుతున్నారు. అంతేకాదు... అప్పుడప్పుడూ కొంచెం ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి జరిగితే.. దాన్ని ఎంచక్కా గ్రిడ్‌కు కనెక్ట్ చేసి అమ్మేసుకుంటున్నారు. భలే ఐడియా కదూ...!

మరిన్ని వార్తలు