వైవిధ్యమే భారత్‌ మహాబలం

19 Jan, 2020 00:13 IST|Sakshi

సందర్భం

దేశవ్యాప్తంగా పౌరసత్వ చట్టంపై చర్చ జరుగుతోంది. బ్రిటిష్‌ ప్రభుత్వం భారత భూమిని విడిచిపెట్టిన సమయంలో, మత ప్రాతిపదికగా పాకిస్తాన్‌ విడిపోయింది. మరి భార తదేశంలో అధిక సంఖ్యాకుల మతమైన హిందూ మతాన్ని జాతీయమతంగా ప్రకటించకుండా, రాజ్యాంగ నిర్మాతలు మన దేశాన్ని లౌకిక రాజ్యంగా ఎందుకు నిర్మించారు అని అర్థం చేసుకోవలసిన సందర్భం ఇవాళ ఏర్పడింది. ‘దృఢత్వం సారూప్యతలలో కాదు వైవి ధ్యంలో ఉంటుంది’ అన్నారు ప్రఖ్యాత అమెరికన్‌ విద్యావేత్త స్టీఫెన్‌ కొవోయ్‌. ‘జీవ వైవిధ్యం’ గురించి చెబుతూ శాస్త్రజ్ఞులు, ప్రాణులలో వైవిధ్యం ఎంత ఎక్కువగా ఉంటే, అంత చక్కగా పర్యావరణంలో సమతుల్యత ఉంటుంది అంటారు. ఇదే సిద్ధాంతం మానవావరణానికి కూడా వర్తిస్తుంది. భిన్నత్వం ఉండే సమాజమే, పూర్తిగా సారూప్యమైన సమాజంకన్నా గొప్పగా మనగలుగుతుంది. 125 కోట్లకు పైగా జనాభా మనది. జన్యు గణన చూస్తే, నాలుగున్నర వేల రకాల జన్యు వైవి ధ్యాలు గల ప్రజలున్నారిక్కడ.

అదే సమయంలో, పూర్తిగా వేరు వేరుగా ఉన్న ఏ ఇద్దరి వ్యక్తుల జన్యువుల మధ్య ఉన్న తేడా మాత్రం కేవలం 0.01మాత్రమే. 780కి పైగా చిన్నా పెద్దా భాషలు, లెక్కకు మిక్కిలి యాసలు, అనేకానేక ఆహార అలవాట్లు, రకరకాల వస్త్రధారణలు మన సంస్కృతిలో భాగం. బ్రిటిష్‌ ప్రభుత్వం ఈ భూభాగాన్ని వదిలి వెళ్ళేప్పటికి 550కి పైగా సంస్థానాలుగా ఉంది.  వాటిని కలిపి ఒక దేశంగా చేశారు. ఆ రోజున ‘మతమే’ విభజనకు ప్రధాన కారణం. ఆ ప్రమాదం మళ్ళీ రాకూడదు అనే దూరదృష్టితో, మతపరమైన వేర్పాటు వాదాలు తిరిగివచ్చే అవకాశం లేకుండా దీనికి సెక్యులర్‌ సూత్రాన్ని బలంగా కట్టారు.  ఎవరి పూర్వీకులు ఎవరు? ఎవరి పూర్వీకుల మతం ఏమిటి? ఎవరు ఇక్కడివారు? ఎవరు బైటనుంచి వచ్చారు? వీటిని నిర్ధారించే పరిమాపకాలు ఏవీ లేవు. లోతుకివెళ్తే దాదాపు అందరూ బైటవారుగానే మిగలొచ్చు! ఒక భూభాగంలో వారసత్వానికి ప్రధాన అర్హత పుట్టుకే. ఇక్కడ పుట్టిన ప్రతివారూ ఈ దేశ పౌరులే. దానిని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు. ఒకే సరిహద్దుల లోపల నివసించే పౌరులకు వేరు వేరు నియమాలు విధించడం ప్రమాదకర చర్య. భిన్నత్వానికి లోటులేని సమాజాన్ని, రాజ్యాం గాన్ని రాసేప్పుడే తయారు చేసి మనకిచ్చారు.

ఇప్పుడు మనం చెయ్యాల్సింది, దానిని జాగ్రత్తగా కాపాడుకోవడమే. మనుషుల మధ్య పరస్పర అంగీకారం,  అవసరం మాత్రమే చిట్టచివరికి నిలబడే కారకాలు. ఎన్నో వైరుధ్యాలను  అధిగమించి తయారు చేసిన దేశాన్ని జాగ్రత్త పెట్టుకోవాలంటే, ముందు వాటిని అర్థం చేసుకోవాలి. ప్రేమించగలగాలి. సంయమనం, సర్దుబాటు పెంచుకోవాలి. ఆదిమానవ జాతులలో కొన్ని నాశనం అవడానికి వాటిలో వైవిధ్యం లేకపోవడం ఒక కారణం అనే సత్యాన్ని, ఈ నాగరిక సాంకేతిక యుగంలో నివసించే మానవాళి మర్చిపోకూడదు. మత రాజ్యాలు కూడా, లౌకికతలో ప్రయోజనాలను గుర్తించి తమ తమ విధానాలలో మార్పు చేసుకోవాల్సి ఉంది. లౌకికరాజ్యం మానవ జీవన ప్రమాణాలను పెంచుతుంది. 2009లో 114 దేశాల్లో జరిగిన గాలప్‌ సర్వే ద్వారా, కొన్ని మినహాయింపులు పోను, పౌర జీవితంలో మత ప్రమేయం ఎక్కువగా ఉన్న దేశాల్లో తలసరి ఆదాయం తక్కువగా ఉన్నదనీ, తక్కువ మత ప్రమేయం కల దేశాల్లో ఎక్కువ ఉన్నదనీ నిర్ధారణ అయ్యింది. మట్టి మనుషులది కాదు. మనుషులే మట్టికి చెందుతారు. ఈ సత్యాన్ని మననం చేసుకుంటూ, మరింత మెరుగైన దేశాన్ని నిర్మించడానికి వ్యూహాలను రచించడంపైన భారత ప్రజలు, వారిద్వారా ఎన్నికైన పాలకులు దృష్టి సారించాలి.

ఎమ్మెస్కే కృష్ణ జ్యోతి
వ్యాసకర్త అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘‘శాంతా, ఎట్లున్నవ్‌? తింటున్నవా?

ముందు జాగ్రత్తే మందు..

వైరసాసురమర్దిని

చేతులెత్తి మొక్కుతా..!

దేశం ఏదైనా వేదన ఒక్కటే

సినిమా

జోడీ కుదిరిందా?

గురి మారింది

దొరికిన‌ అవ‌కాశాన్ని వ‌దులుకోనంటున్న మ‌హేశ్‌

చేతులెత్తి నమస్కరిస్తున్నా : బాలకృష్ణ

ప్ర‌ధానిని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తిన రంగోలీ

బిగుతు దుస్తులు వ‌ద్ద‌న్నారు: ప‌్రియాంక‌