చర్మం... దాని మర్మం!

6 May, 2015 23:11 IST|Sakshi
చర్మం... దాని మర్మం!

ట్రివియా
 
{పతి వ్యక్తిలోనూ లోపలి అవయవాలను కప్పి ఉంచే అతి పెద్ద అవయవం చర్మమే. ఒక వ్యక్తి చర్మం సగటు బరువు 4 కిలోలు. అలాగే దాని వైశాల్యం 2 చదరపు మీటర్లు ఒక వ్యక్తి ప్రతి సగటున 28 రోజులకు కొత్త చర్మాన్ని పొందుతుంటాడు. మన గోళ్లపైన ఉండే వెనకభాగం పెరిగి గోరు చివరకు రావడానికి 3 - 6 నెలల వ్యవధి పడుతుంది. ఒక చదరపు అంగుళం వైశాల్యమున్న చర్మంపై కోటీ తొంభైలక్షల చర్మకణాలుంటాయి. ఈ వైశాల్యంలో 60 వెంట్రుకలూ, 90 నూనెగ్రంథులు, 625 చెమట గ్రంథులు, 19,000 స్పర్షజ్ఞానాన్ని కలిగించే సెన్సరీ కణాలుంటాయి.

మన చర్మంపై ప్రతి చదరపు సెం.మీ. పై ఉండే బ్యాక్టీరియా సంఖ్య లక్ష. చర్మం నుంచి వచ్చే చెమటకు ఎలాంటి వాసనా ఉండదు. కానీ బ్యాక్టీరియా వల్లనే వాసన వస్తుంది. మానవ చర్మం ప్రతి గంటకూ కనీసం 6 లక్షల కణాలను వదులుకుంటుంది. మనం ముఖం కడుక్కోగానే అది తేటగా శుభ్రంగా కనిపించడానికి కారణం. ముఖంపైన పేరుకున్న మృతకణాలు తొలగిపోయి, ఆ స్థానంలో కొత్త కణాలు రావడమే. మనం కోల్పోయేవీ, కొత్తగా పుట్టే చర్మకణాలను పరిగణనలోకి తీసుకుంటే ఒక మనిషి జీవితకాలంలో దాదాపు 1000 సార్లు చర్మం మారుతుందని అనుకోవచ్చు.
 

మరిన్ని వార్తలు