మందారాలు - మకరందాలు

10 Oct, 2017 16:33 IST|Sakshi

నెయిల్‌ ఆర్ట్‌

మేకప్‌కు అగ్రస్థానం ఇచ్చే ఈ ట్రెండీ రోజుల్లో మోడర్న్‌ మగువలకు... నెయిల్‌ ఆర్ట్‌ అంటే భలే ఇష్టం! రంగురంగుల నెయిల్‌ పాలిష్‌లతో పాటు.. ఒక నెయిల్‌ రిమూవర్‌ ఉంటే చాలు. ఎలాంటి ఆర్ట్‌నైనా మీ చేతుల్లో చూసుకోవచ్చు! కొమ్మలు, రెమ్మలే కాదు ముద్దుగొలిపే మకరందపు మందారపూలను కూడా గోళ్లపై పూయించుకోవచ్చు. చూపరుల నుంచి ప్రశంసలు పొందేయొచ్చు! ఈ నెయిల్‌ ఆర్ట్‌ని చూడండి! భలే ఉంది కదూ! మరి ఇంకెందుకు ఆలస్యం..? ఈ చిత్రంలో చూపించినట్లుగా... లేదా మీరు వేసుకున్న డ్రెస్‌ కలర్‌కు తగ్గట్టుగా కలర్స్‌ ఎంచుకునైనా.. నిమిషాల్లో ఈ నెయిల్‌ ఆర్ట్‌ వేసుకోండి. ట్రై చేయండి.

1. ముందుగా నెయిల్స్‌ శుభ్రం చేసుకుని షేప్‌ చేసుకోవాలి. తర్వాత నెయిల్స్‌ అన్నింటికీ వైట్‌ కలర్‌ అప్లై చేసుకోవాలి

2. తర్వాత సన్నని బ్రష్‌ తీసుకుని టైట్‌ పింక్‌ కలర్‌ లేదా మెచ్చిన కలర్‌తో చిత్రాన్ని అనుసరించి మందార పూల రేకులు వేసుకోవాలి.

3. ఇపుడు కాస్త డార్క్‌ పింక్‌ కలర్‌ నెయిల్‌ పాలిష్‌ తీసుకుని సన్నని బ్రష్‌తో ఇంతకు ముందు వేసిన లైట్‌ పింక్‌ మందార పూలరేకులను చిత్రంలో చూపిన విధంగా హైలెట్‌ చేసుకోవాలి.

4. తరువాత గ్రీన్‌ కలర్‌ తీసుకుని చిత్రంలో ఉన్న విధంగా సింబల్‌ వేసుకోవాలి.

5. ఇపుడు వైట్‌ కలర్‌ తీసుకుని సన్నని బ్రష్‌తో గ్రీన్‌ కలర్‌ సింబల్‌కి చిత్రాన్ని గమనిస్తూ గీతలు పెట్టుకోవాలి.

6. ఇపుడు బ్లాక్‌ కలర్‌ లేదా డార్క్‌ గ్రీన్‌ కలర్‌ నెయిల్‌ పాలిష్‌ తీసుకుని ఆకుపచ్చ ఆకు మధ్యలో ఈనుల్లా గీతలు పెట్టుకోవాలి. తరువాత ఎల్లో కలర్‌ నెయిల్‌ పాలిష్‌ తీసుకుని మందార పువ్వు పైన మూడు చిన్న చిన్న చుక్కలు పెట్టుకుని వాటిపై రెడ్‌ కలర్‌ నెయిల్‌ కలర్‌ చుక్కలు పెట్టుకోవాలి. ఇదే విధంగా అన్ని నెయిల్స్‌ కి మందార పూలు , ఆకులను డిజైన్‌ చేసుకుంటే సూపర్‌ లుక్‌ వస్తుంది.

మరిన్ని వార్తలు