పూల గోర్లు

28 Aug, 2013 23:46 IST|Sakshi
పూల గోర్లు

గోరు మీద రకరకాల హంగులను, అందాలను కళ్లముందు ఆవిష్కరించడానికి ఎన్నో కళలున్నాయి. నచ్చిన రంగు నెయిల్ పాలిష్‌తో గోళ్లను సింగారించి మురిసిపోతారు కొందరు. రకరకాల రంగుల నెయిల్ పాలిష్‌ల కాంబినేషన్లతో గోళ్లమీద తీరైన డిజైన్లను వేసి మెరిపిస్తారు కొందరు. అతివల మురిపాన్ని మరింత అందంగా చూపించడానికి, గోళ్లమీద డిజైన్‌లాగ మారడానికి స్టిక్కర్స్ పోటీపడుతున్నాయి. నచ్చిన స్టిక్కర్స్ తెచ్చి నెయిల్స్‌పై అతికించుకుంటే చాలు మెరిసిపోయే అందం గోళ్ల సొంతం.
 
గోళ్ల రంగు కంటే ముందు వాటి శుభ్రత విషయంలో శ్రద్ధ పెట్టాలి. మేనిక్యూర్ ద్వారా గోళ్లను చక్కగా మార్చుకోవాలి.  వేసుకున్న డ్రెస్ కలర్స్‌ని దృష్టిలో పెట్టుకొని నెయిల్ పాలిష్‌ను, స్టిక్కర్స్‌ని ఎంచుకోవాలి.  సింపుల్‌గా కనిపించాలంటే ముందుగా నచ్చిన స్టిక్కర్‌ని గోటి మీద అతికించాలి. తర్వాత బేస్‌కోట్ పాలిష్‌ను వేయాలి.  

పార్టీకి రెడీ అవ్వాలంటే డ్రెస్‌కు తగిన కాంబినేషన్ నెయిల్ పాలిష్‌ను వేసుకొని, ఆరిన తర్వాత స్టిక్కర్స్‌ను అతికించాలి. పైన బేస్ కోట్ వేయాలి. దీంతో స్టిక్కర్ ఊడిపోదు. డిజైన్ చేసినట్టుగానే అందంగా కనిపిస్తుంది.  ఇక నుంచి నెయిల్ ఆర్ట్ కోసం నిపుణుల దగ్గరకే వెళ్లాల్సిన పనిలేదు. కాస్త శ్రద్ధపెడితే మీకు మీరే నెయిల్ ఆర్టిస్ట్‌లు కాగలరు. ‘గోరంతా’ అందాలను నింపగలరు.
 

మరిన్ని వార్తలు