ఓ రాజకుమారి కథతో...

22 Nov, 2015 01:13 IST|Sakshi
ఓ రాజకుమారి కథతో...

వైవిధ్యమైన చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంటున్న నారా రోహిత్ మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘కార్తికేయ’ చిత్రాన్ని నిర్మించినవెంకట శ్రీనివాస్ బొగ్గరం సారథ్యంలో ‘కథలో రాజకుమారి’ పేరుతో ఓ సినిమా రానుంది. మహేశ్ సూరపనేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నమితా ప్రమోద్ కథానాయిక. ఇళయ రాజా స్వరాలు సమకూరుస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘ ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో చిత్రాన్ని నిర్మించనున్నాం. ఇళయరాజా గారు  సంగీతం అందించడం మా అదృష్టం. జనవరిలో చిత్రీకరణ ప్రారంభిస్తాం’’అని చెప్పారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జయేశ్ నాయర్, సహ నిర్మాత:బీరం సుధాకర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ప్రవసాయి సత్యనారాయణ, సమర్పణ: శిరువూరి రాజేశ్ వర్మ.

మరిన్ని వార్తలు