స్పాండిలోసిస్ను గుర్తించడానికి తోడ్పడే ఐదు ‘డి’లు...

14 Sep, 2016 23:58 IST|Sakshi
స్పాండిలోసిస్ను గుర్తించడానికి తోడ్పడే ఐదు ‘డి’లు...

మెడనొప్పితో వచ్చే సర్వైకల్ స్పాండిలోసిస్ లక్షణాలను ఐదు ‘డి’ లతో తేలిగ్గా  గుర్తించవచ్చు. అదెలాగంటే... ఇంగ్లిష్ అక్షరం ‘డి’తో మొదలయ్యే ఐదు లక్షణాలను గమనించుకుంటూ ఉంటే చాలు.

 1.  డిజ్జీనెస్ : తల తిరిగినట్లు ఉండటం

 2.  డిప్లోపియా : కళ్లు మసకబారినట్లుగా ఉండి ఒకటే ఇమేజ్ రెండుగా అనిపించడం

 3. డ్రాప్ అటాక్ : కండరాలు ఒక్కసారిగా బిగుసుకోవవడం

 4.  డిస్ఫేజియా : సరిగ్గా మింగలేకపోవడం

 5.  డిసార్థ్రియా : మాట తడబడటం
ఇంగ్లిష్ అక్షరం ‘డి’తో మొదలయ్యే ఈ ఐదు లక్షణాలతో పాటు తలనొప్పి, చేతులు, భుజాలు లాగినట్లుగా ఉండటం, మెడ కండరాలు బలహీనంగా అనిపించడం, మెడ దగ్గర్నుంచి చేతుల వరకు బరువుగా అనిపించడం వంటి లక్షణాలు కూడా స్పాండిలోసిస్‌లో కనిపిస్తుంటాయి.

మరిన్ని వార్తలు