నెదర్లాండ్స్

4 Apr, 2015 22:45 IST|Sakshi
నెదర్లాండ్స్

ప్రపంచ వీక్షణం
 
ఆమ్‌స్టర్‌డామ్ నగరం

 ఆమ్‌స్టర్‌డామ్ నగరం నీటి కాలువలకు ప్రసిద్ధి. నగరంలో ఎటు చూసినా నీటితో నిండిన కాలువలు, ఆ నీళ్ళలో బోట్‌లు ప్రయాణిస్తూ కనబడతాయి.ఈ నీటి కాలువలు 17 వ శతాబ్దం నుండి ఉన్నాయి. మొత్తం ప్రపంచంలో ఇలాంటి నగరం మరెక్కడా కనిపించదు. కాలువలకు ఇరువైపులా ఏడెనిమిది అంతస్థుల భవనాలు ఉన్నాయి. రాత్రిపూట ఈ భవనాల విద్యుత్తు దీపాల కాంతులు నీటిలో పడి కొత్త అందాలను విరజిమ్ముతాయి. నగరంలో 100 కిలోమీటర్ల పొడవైన కాలువలు, వాటి మీద 1500 బ్రిడ్జిలు నిర్మించబడి ఉన్నాయి. దాదాపు 1550 అద్భుతమైన పురాతన కట్టడాలు ఉన్నాయి.
 ఈ దేశానికి వచ్చే సందర్శకులు తప్పకుండా చూసే భవనం రిజిక్స్ మ్యూజియం.
 ఈ మ్యూజియంలో డచ్ గోల్డెన్ ఏజ్ నాటి పెయింటింగ్ కళాకృతులు ఉన్నాయి.
 
నైసర్గిక స్వరూపం

 
ఖండం: యూరోప్
వైశాల్యం: 41,543 చదరపు కిలోమీటర్లు
జనాభా: 1,69,12,640 (తాజా అంచనాల ప్రకారం)
రాజధాని: ఆమ్‌స్టర్‌డామ్
ప్రభుత్వం: యూనిటరీ రిపబ్లిక్ కాన్‌స్టిట్యూషనల్ మొనార్చి
అధికార భాష: డచ్... ఇంగ్లిష్, జర్మనీ భాషలు కూడా మాట్లాడతారు.
మతం: క్రైస్తవం
కరెన్సీ: యూరో, అమెరికన్ డాలర్లు
వాతావరణం: డిసెంబర్-ఫిబ్రవరిలో సున్న డిగ్రీలు,
ఆగస్ట్-ఆక్టోబర్‌లలో 20 డిగ్రీలు.
పంటలు: పప్పుధాన్యాలు, బంగాళదుంపలు, చెరకు, పళ్ళు, కూరగాయలు
పరిశ్రమలు: ఇనుము, ఉక్కు, రసాయనాలు, దుస్తులు, పొగాకు, ప్రింటింగ్. ఓడలనిర్మాణం, ఎరువులు శుద్ధ యంత్రీకరణ.
స్వాతంత్య్రం: 1954
సరిహద్దులు: బెల్జియం, పశ్చిమ జర్మనీ, నార్త్ ఓ
 
 చరిత్ర

 క్రీ.పూ. 53లో జూలియస్ సీజర్ ఈ ప్రాంతాన్ని ఆక్రమించి పరిపాలన చేశాడు. దాదాపు నాలుగు శతాబ్దాలు రోమన్లు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. క్రమంగా ఫ్రాంక్ రాజులు రోమన్‌లను పారద్రోలి ఈ ప్రాంతాన్ని ఆక్రమించారు. క్రమక్రమంగా వివిధ రాజులు పాలిస్తూ వచ్చారు. 6వ శతాబ్దంలో ఫ్రిసియన్ రాజులు పాలించారు. తిరిగి 10వ శతాబ్దంలో రోమన్‌లు ఈ ప్రాంతాన్ని తిరిగి ఆక్రమించారు. కాని వీరి పాలనలో ఐకమత్యం లేక స్థానికంగా చిన్న చిన్న డచ్చివారి ప్రైవేటు సామ్రాజ్యాలు ఏర్పడ్డాయి. 13వ శతాబ్దంలో ఇండోనేయల్, ఫ్రెంచి రాజులు ఈ ప్రాంతాన్ని ఆక్రమించారు. 17వ శతాబ్దంలో డచ్చి పాలకులు మొత్తం నెదర్లాండ్స్ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. వీరి పరిపాలనను గోల్డెన్ ఏజ్ అని పిలుస్తారు. 17, 18 శతాబ్దాలలో బటావియన్ రాజకుటుంబం ఈ ప్రాంతాన్ని పాలించింది. 19వ శతాబ్దంలో ఇంగ్లండ్, జర్మనీలు పరిపాలించాయి. క్రీ.శ.1581లోనే స్పెయిన్ నుండి స్వతంత్రదేశంగా ప్రకటింపబడినా, 1954లో స్వతంత్ర దేశంగా ఏర్పాటయింది.

 ప్రజలు-సంస్కృతి: ఈ దేశంలో జనసాంద్రత ఎక్కువ. ఒక చదరపు కిలోమీటరుకు 404 మంది నివసిస్తున్నారు. ప్రజలు డచ్చి భాషను మాట్లాడుతారు ఇక్కడి ప్రజలు వాళ్ళ స్వంత భాషతో పాటు జర్మన్, ఫ్రెంచి, ఇంగ్లిష్ వంటి విదేశీ భాషలు కూడా నేర్చుకుంటారు. ఇక్కడి ప్రజలంతా క్రైస్తవులు, వీరిలో క్యాథలిక్కులు అధికం. జనాభాలో అధికశాతం ప్రజలు దేవుణ్ణి నమ్మరు. దేశంలో బౌద్ధులు, హిందువులు ముస్లిముల జనాభా కూడా చెప్పుకోదగ్గ రీతిలో ఉంది. సాధారణంగా యువత యుక్తవయసు రాగానే స్వతంత్ర జీవనానికి ఇష్టపడతారు. వీరి వస్త్రధారణ అధునాతనంగా ఉంటుంది. దేశంలో డచ్చి సంస్కృతి అధికంగా కనబడుతుంది.

 పరిపాలనరీతులు: పరిపాలనా సౌలభ్యం కోసం  దేశాన్ని 12 ప్రావిన్స్‌లుగా, ఈ ప్రావిన్స్‌లను తిరిగి మున్సిపాలిటీలుగా విభజించారు. దేశంలో 393 మున్సిపాలిటీలున్నాయి. దేశంలో పెద్ద నగరాలు ఆమ్‌స్టర్ డామ్, రోటర్ దాక్షే, దిహేగ్, ఉబ్రెచ్, ఈండోవెన్, టిల్‌బర్గ్, టీబర్గ్, గ్రోనిక్‌జెన్, అల్‌మిరె, బ్రెడా, నిజ్మెజెన్‌లు.

 పంటలు- పరిశ్రమలు: వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులో నెదర్లాండ్స్ ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది. కూరగాయలు, పళ్ళ ఉత్పత్తి అధికం. దేశంలో వ్యవసాయం పూర్తిగా శాస్త్రీయంగా ఉంటుంది. చెరకు, బంగాళదుంపలు, గోధుమ, బార్లీ, వివిధ రకాల పూలు అధికంగా ఉత్పత్తి అవుతాయి. దేశంలో అంతర్జాతీయ కంపెనీలు ఉన్నాయి. దేశీయంగా వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్‌తో పాటు వివిధ కంపెనీలు నెలకొని ఉన్నాయి. రాయల్ డిచ్‌షెల్, ఇంగ్ గ్రూప్, ఈగాన్, ఈయాడ్స్, ల్యోండెల్‌బేసెల్, రాయల్ అహోల్డ్, రాయల్ ఫిలిప్స్, రోబో బ్యాంక్ గ్రూపు, గాస్ టెర్రా హెనెకెన్ హోల్డింగ్, అర్‌జో నోబెల్ లాంటి దిగ్గజ కంపెనీలు దేశంలో ఉన్నాయి మెటల్ ఇంజనీరింగ్ ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ యంత్రాలు, వ్యవసాయ పరికరాలు, రసాయనాలు, పెట్రోలియం ఉత్పత్తులు, భవన నిర్మాణ యంత్ర పరికరాలు, మైక్రో ఎలక్ట్రానిక్స్ మొదలైన పరిశ్రమలు దేశంలో అత్యధిక  స్థాయిలో ఉన్నాయి. వివిధ ఉత్పత్తుల ఎగుమతుల విలువ సాలీనా 556 బిలియన్ డాలర్లు.

ఆహారం: ప్రజలు సాధారణంగా కూరగాయలు, మాంసం తింటారు. బ్రెడ్, బంగాళదుంపలు, వెన్నతో చేసిన బన్ను లాంటి పదార్థం అధికంగా తింటారు. ఇలాంటి పదార్థాలను హజల్ స్లాస్, లోకెన్, ముసిజెస్, చాకోలెట్, ట్రెపిల్ అంటారు. కాఫీ, టీ, బిస్కెట్స్ అధికంగా తీసుకుంటుంటారు. మధ్యాహ్న భోజనంలో మాంసం, బంగాళదుంప తప్పనిసరి.
 
 చూడదగిన ప్రదేశాలు

డెల్టా ప్రాజెక్టు: ఈ డెల్టా ప్రాజెక్టు పనులు 1950 నుండి 1958 వరకు నిరంతరంగా జరిగాచి. దేశంలో సముద్ర సగభాగం వరకు చొచ్చుకు రావడం వల్ల దానిని అడ్డుకట్ట వేయడానికి ఈ డెల్టాప్రాజెక్టులు నిర్మించారు. వీటిని జీలాండ్, హోలాండ్ ప్రావిన్స్‌ల మధ్యభాగంలో నిర్మించారు. సముద్రం నుండి భూభాగాన్ని కాపాడడానికి ఇవి ఉపయోగపడుతున్నాయి. ఈ ప్రాజెక్టులో డామ్ స్లూయిస్‌లు, లాక్‌లు, డైక్‌లు, సర్జ్ బారియర్‌లు నిర్మించారు. వీటిని ఆధునిక ఏడు ప్రపంచవింతలుగా అమెరికన్ సివిల్ ఇంజనీర్ సొసైటీ పేర్కొంది.
 మాస్ట్రిచ్ వ్రిజ్‌తాఫ్: ఈ వ్రిజ్‌తాప్, మాస్ట్రిచ్ నగరంలో ఒక సుప్రసిద్ధ సిటీ స్క్వేర్. ఈ నగరంలో దేశంలోని దక్షిణ భాగంలో ఉంది. నగరంలో సెయింట్ సెర్వాటియస్ చర్చి, సెయింట్ జాన్ క్యాథడైల్ ఉన్నాయి. ఇక్కడ పండుగలను అద్భుతరీతిలో నిర్వహిస్తారు.
 డి హోగె వెలువె జాతీయ పార్కు: దేశం వైశాల్యం చిన్నదే అయినా ఇక్కడ ప్రకృతి సంపదకి కొదువలేదు. దేశంలో అతిపెద్ద పార్కు ఈ డి హోగె వెలువె. ఇది దాదాపు 13,800 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. రకరకాల పక్షులు, అడవి జంతువులు పార్కులో ఉన్నాయి. సందర్శకులు సైకిళ్లతో ఈ పార్కులో తిరిగి రావచ్చు.
 
చారిత్రక నగరం ఉట్ట్రెజ్: దేశంలో ఇది అత్యంత పురాతన నగరం. 8వ శతాబ్దంలో ఈ నగరాన్ని ఒక మత కార్యకలాపాల కేంద్రంగా నిర్మించారు. ఈ నగరంలో ఆ కాలంనాటి సెయింట్ మార్టన్ క్యాథడ్రల్, గ్రోధిక భవనం, డోమ్ టవర్, సెయింట్ సాల్వటర్ చర్చి, సెయింట్ పీటర్ బిల్డింగ్, సెయింట్ మేరీ చర్చి, సెయింట్ నికోలస్ మోనాస్టరీ, సెయింట్ పాల్ అబే, మొదలైన పురాతన భవనాలతో పాటు ఆధునిక భవనాలు కూడా ఇక్కడ దర్శనమిస్తాయి. ఈ నగరం గుండా రైన్ నది పాయ ఒకటి ప్రవహిస్తుంది. నగరంలో 105 మీటర్ల ఎత్తై రోబోబాంక్ టవర్ ఒక గొప్ప ఆకర్షణ.
 
కూకెన్‌హఫ్ ఫ్లవర్ గార్డెన్: 15వ శతాబ్దంలో అభివృద్ధి చేసిన కూకెన్‌హఫ్ ఫ్లవర్ గార్డెన్ ప్రపంచంలో అతిగొప్ప ఉద్యానవనం. దీనినే ‘‘గార్డెన్ ఆఫ్ యూరోప్’’ అంటారు. దాదాపు 79 ఎకరాల విస్తీర్ణంలో  ఎటూ చూసినా పచ్చదనం, దానిమీద రంగురంగుల తులిప్ పుష్పాలు కనువిందు చేస్తాయి. దీన్ని చూసేందుకు మార్చి, ఏప్రిల్, మే నెలల్లో మాత్రమే అనుమతి ఇస్తారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 25న ఫ్లవర్ పరేడ్ నిర్వహిస్తారు. ఈ ఉద్యానవనాన్ని  ప్రపంచంలోని వివిధ దేశాల రాజులు, రాణులు సందర్శించారు.
 

Election 2024

మరిన్ని వార్తలు