మసాముద్రికలు

2 Jun, 2016 23:14 IST|Sakshi
మసాముద్రికలు

నృత్యంలో .. శిల్పంలో..
చిత్రంలో .. భాషలో ..
యోగాలో... ధ్యానంలో ..
అంతేనా...! వస్త్రంలోనూ ముద్రలు.
ఆధునిక ఫ్యాషన్ ప్రపంచంలో తమదైన ‘ముద్ర’ వేశారు మసాబా గుప్తా!
అరచేతిని అర్ధం చేసుకోవడం హస్తసాముద్రికం.
మసాబా డిజైన్స్‌ని అర్థం చేసుకోవడం మసాముద్రికం.

 

చేతులు, పాదాలు, టైపు మిషన్లు, స్పూన్లు, సాసర్లు,..ఇవే కాదు తమిళ లిపి, ఇతర ముద్రలు తెలుపు, నలుపు రంగుల ప్రింట్లుగా ఫ్యాబ్రిక్ మీద అందంగా కొలువుదీర్చుతారు మసాబా గుప్తా. అక్కడక్కడా నియాన్ కలర్స్‌తో దుస్తులకు కొత్త సింగారాలు అద్దుతారు. ఇవే మసాబా గుప్తాను డిజైనర్లలో ప్రత్యేకంగా నిలిపాయి. మసాబా ప్రింట్లుగా అంతటా పేరొందాయి. ముంబయ్ డిజైనర్ అయిన మసాబా గుప్తా నటి నీనాగుప్తా, వెస్ట్ ఇండీస్ క్రికెటర్ వివ్ రిచర్డ్స్‌ల కూతురు.


ప్రముఖ డిజైనర్ సత్యపాల్ దగ్గర శిష్యురాలుగా చేరి ప్రావీణ్యం సాధించిన మసాబా తన సృజనతో సెలబ్రిటీలను మరింత స్పెషల్‌గా చూపిస్తున్నారు. ప్రత్యేకంగా ఉండే ఆ డిజైన్లలో శారీస్, ప్రింటెడ్ కుర్తీలు, సల్వార్ కమీజ్, లెహెంగా, గౌన్, టాప్స్, ట్యునిక్స్.. వంటివెన్నో ఉన్నాయి.

 

>
మరిన్ని వార్తలు