పార్టీ 2017

29 Dec, 2016 23:25 IST|Sakshi
పార్టీ 2017

17లో 16 ఏళ్ళ అమ్మాయిలా కనపడాలంటే!
ఎన్నేళ్ళొచ్చినా 16 ఏళ్ళ అమ్మాయిలా
పార్టీ చేసుకోవాలంటే...
గెట్‌ రెడీ! గెట్‌ ఎ ప్రామ్‌!
సింగిల్‌ పీస్‌ బ్యూటీలివి.
పార్టీలను పరమళింప చేసే సూట్లు ఇవి.
కమాన్‌.. లెటజ్‌ గో పార్టీ!


ఎక్కడ ఉన్నా పార్టీకే ప్రత్యేకం  అనిపించే బ్లాక్‌ కలర్‌ ప్రామ్‌ గౌన్‌.

మత్స్య సుందరిని తలపిస్తున్న గ్రే కలర్‌ ప్రామ్‌ డ్రెస్‌. పార్టీకి ప్రత్యేక హంగులను అద్దుతుంది.

కొత్త సంవత్సరాన పచ్చని పరవశాన్ని మోసుకొస్తుంది గ్రీన్‌ కలర్‌ ప్రామ్‌డ్రెస్‌.

పొడవాటి గౌనులా ఉండే ప్రామ్‌
విదేశాలలో సాయంకాల బాల్‌రూమ్‌ డ్యాన్స్‌లకు తప్పనిసరి డ్రెస్‌గా ఉంటుంది. శరీరానికి అతుక్కుని ఉండే ఈ గౌన్‌ను ధరించడం వల్ల శరీరాకృతి అందంగా కనిపిస్తుంది. కట్టుకున్నవాళ్లు డ్రెస్‌ కట్‌ వల్ల మత్స్యసుందరిలా, యువరాణుల్లా, మహారాణుల్లా కనిపిస్తారు. ఎ–లైన్, కోణాకృతి శరీర ఆకృతి గలవారికీ బాగా నప్పే ఈ డ్రెస్‌ దాదాపు 16, 17 శతాబ్దంలో వెలుగులోకి వచ్చింది. 18వ శతాబ్దంలో ఫార్మల్‌  డ్రెస్‌గా, ఈవెనింగ్‌ బాల్‌ డ్యాన్స్‌ డ్రెస్‌గా పేరొందింది. 19వ శతాబ్దంలో  పార్టీ డ్రెస్‌ అంటే  ప్రామ్‌ డ్రెస్‌ తప్పక ఉండాల్సిందే అనే ముద్ర పడిపోయింది. పాశ్చాత్య వివాహవేడుకలలో తప్పక కనిపించే ఈ డ్రెస్‌ మన దగ్గర ఈవెనింగ్‌ పార్టీలో తళుక్కుమంటోంది.


పువ్వులు, లతలు ప్రామ్‌ డ్రెస్‌ మీద కొత్త సింగారాలు అద్దుతుంటే వేడుకలో సిండ్రెల్లా అనిపించాల్సిందే!

వంగపండు రంగు ప్రామ్‌డ్రెస్‌ ధరిస్తే యువరాణిలా  మెరిసిపోకుండా ఉండలేరు.

చీకటి వెలుగులకు కొత్త బాష్యాన్ని చెప్పే నలుపు–తెలుపు కాంబినేషన్‌ ప్రామ్‌ పార్టీలో హైలైట్‌.

రాయల్‌ బ్లూ కలర్, ఒన్‌ షోల్డర్‌ ప్రామ్‌ డ్రెస్‌. పార్టీకి రాచరికపు సొబగులను మోసుకొస్తుంది.

పార్టీలో డ్రెస్‌కే ప్రత్యేకత
ఆభరణాలు, ఇతర అలంకారాలు అవసరమే లేదు.
సింపుల్‌ మేకప్‌ పార్టీ వినోదానికి స్పెషల్‌ అట్రాక్షన్‌.
హెయిర్‌ స్టైయిల్స్‌కు హైరానా వద్దు. లూజ్‌ హెయిర్‌ ప్రామ్‌ డ్రెస్‌కి సిసలైన స్టైల్‌.

మరిన్ని వార్తలు