మనీష్ మాసం

11 Feb, 2016 22:58 IST|Sakshi
మనీష్ మాసం

పెళ్లి వేడుక... మనీష్ అంటారు.
అట్టహాసమైన పార్టీ... మనీష్ అంటారు.
ఏదో ఒక భారీ ఫ్యాషన్ షో... ఇంకెవరు మనీషే.
మనీష్.. మనీష్.. మనీష్... ఎవరితను?
మనీష్ మల్హోత్రా.... దేశంలో నం.1 ఫ్యాషన్ డిజైనర్.
అందగత్తెల అందాన్ని తన దుస్తుల సోయగంతో పెంచే మేజిక్ టైలర్.
కుఛ్ కుఛ్ హోతాహై... కహోనా ప్యార్ హై..
వంటి సినిమాలకు ఇతడే వలువల రూపశిల్పి.
మాఘమాసం వచ్చింది.
ఇక అందరూ పెళ్లి బట్టలకు క్యూ కడతారు.
తన డిజైన్లతో మాఘమాసాన్ని
మనీష్ మాసం చేసేస్తారు.
శాంపిల్‌గా కొన్ని...

 
అమ్మాయిల కలలకు అద్భుత రూపమిచ్చే సృజన మనీష్ సొంతం. ఈ ఏడాది బెస్ట్ బ్రైడల్ కలెక్షన్‌లో భాగంగా రూపొందించిన డ్రెస్ ఇది.నిన్నటి తరానికి పరిమితం అనదగ్గ చీరలను కూడా ఆధునికం గా మెరిపించడంలో మనీష్ తన ప్రత్యేకతను చాటుతుంటారు. కిందటి నెలలో జరిగిన పోలీస్ ఉమంగ్ షోలో మనీష్ డిజైన్ చేసిన శారీ విత్ బ్లౌజ్‌లో మెరిసిపోతున్న బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, లాంగ్ స్లీవ్‌లెస్ గౌన్‌లో చెల్లెలు షమిత.రెండు రంగుల కాంబినేషన్, ఎంబ్రాయిడరీ వర్క్‌తో ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన డిజైనరీ శారీ ఇది, దానిపై స్లీవ్‌లెస్ బ్లౌజ్ ధరిస్తే వేడుకలో ఆధునికపు హంగులతో వెలిగిపోతుంది.
 
బాలీవుడ్ ప్రముఖ తారలందరికీ అమితంగా నచ్చే ఫ్యాషన్ డిజైనర్ ఎవరంటే అంతే ప్రముఖంగా వినిపించే పేరు మనీష్ మల్హోత్రా. శ్రీదేవి, మాధురి దీక్షిత్, ఐశ్వర్యా బచ్చన్, దీపికా పదుకొనే, సోనమ్ కపూర్ వంటి వారంతా ఆ జాబితాలో ఉన్నవారే. దిల్ తో పాగల్ హై, దిల్ సే, రాజా హిందూస్థానీ, కుఛ్ కుఛ్ హోతా హై.. కహోనా ప్యార్ హై.. ఇలా వందల బాలీవుడ్ సినిమాలకు డ్రెస్ డిజైనర్‌గా ఉన్నారు మల్హోత్రా. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్‌తో పాటు మరెన్నో అవార్డులను తన ఖాతాలో జమచేసుకున్నారు. వెడ్డింగ్ లెహంగాలు, శారీస్, బ్లౌజ్‌లను డిజైన్ చేయడంలో మనీష్ తనదైన ప్రత్యేకతను చాటుతుంటారు.
 
 మనీష్ మల్హోత్రా

మరిన్ని వార్తలు