సందడి పట్టుకోండి

15 Feb, 2019 00:15 IST|Sakshi

ఫ్యాషన్‌

ముహూర్తాలు మూటగట్టుకొని మాఘమాసం వచ్చింది. పెళ్లి పీటల మీద వధువు పక్కన పేరంటాలను కళకళలాడేలా చేయనుంది. అంతా సందడి..  ముచ్చటగా తయారవ్వాలనే తపన  ఆలస్యమెందుకు పట్టు అందుకోండి సందడి పట్టుకోండి. 

►కంచిపట్టు చీర వివాహ వేడుకలకు ఎవర్‌గ్రీన్‌. దీనికి కాంబినేషన్‌గా బెనారస్‌ లాంగ్‌ స్లీవ్స్‌ బ్లౌజ్‌ను ధరిస్తే గ్రాండ్‌లుక్‌తో ఆకట్టుకుంటారు. దీని మీదకు వెడల్పాటి చోకర్స్, టెంపుల్‌ జువెల్రీ లేదా పెద్ద పెద్ద ముత్యాల హారాలు రాణికళను తెప్పిస్తాయి. 

►పెళ్లంటే మూడు ముళ్లు, ఏడడుగులు మాత్రమే కాదు అందమైన పట్టుచీరల రెపరెపలు కూడా ఉండాలి. అవి వధువుకైనా, వేదికను అలంకరించే వనితలకైనా నిండుతనాన్ని తీసుకువస్తాయి. పెళ్లింటికి లక్ష్మీ కళను మోసుకువస్తాయి. 

కంచిపట్టు చీరకు డిజైనర్‌ లాంగ్‌ స్లీవ్స్‌ బ్లౌజ్‌ ఎంపికతో వివాహ వేడుకలో గ్రాండ్‌గా కనిపిస్తారు. అందులోనూ లాంగ్‌ స్లీవ్స్‌ ట్రెండ్‌లో ఉన్న స్టైల్‌. ఆధునికతను, హుందాతనాన్ని కోరుకునే అమ్మాయిలు అమితంగా ఇష్టపడతారు. కుందన్స్‌ ఆభరణాలు కంచిపట్టు చీరలకు అమితమైన కళను తీసుకువస్తాయి. 

►పెళ్లిలో గ్రాండ్‌గా కనిపించడానికి సిల్వర్‌ జరీ పట్టుచీరల కాంబినేషన్‌ బాగా నప్పుతుంది. జరీ రంగులో డిజైనర్‌ బ్లౌజ్‌ ధరించి, పెద్ద పెద్ద రాళ్ల హారాలను ఎంపిక చేసుకుంటే లుక్‌ గ్రాండ్‌గా కనువిందు చేస్తుంది. 

►సింపుల్, మార్వలెస్‌ అనిపించే కలర్‌ కాంబినేషన్స్‌ చిలకపచ్చ, గులాబీ రంగులు. ఈ రంగు కాంబినేషన్‌ బ్లౌజ్‌కి ఎంబ్రాయిడరీతో ప్రత్యేకత తీసుకురావచ్చు. వజ్రాలు, పచ్చల హారాలు హెవీగా అనిపించక స్మార్ట్‌నెస్‌ను తలపిస్తున్నాయి.

– శశి వంగపల్లి, ఫ్యాషన్‌ డిజైనర్, 
ముగ్ద ఆర్ట్‌ స్టూడియో, హైదరాబాద్‌  

మరిన్ని వార్తలు