కుర్తా   కుచ్చిళ్లు

10 Aug, 2018 00:14 IST|Sakshi

చీరకట్టులో ఓ కొత్త స్టైల్‌ కుర్తా–కుచ్చిళ్లు. చీరను కుచ్చిళ్లుగా మడిచి ...  బ్లౌజ్‌ను కుర్తాగా ధరించి...  పల్లూను దుపట్టాలా సింగారిస్తే...  చూపులకు చక్కగా స్టైల్‌కి సూపర్బ్‌గా... సౌకర్యంలో సుందరంగా...

సందర్భమేదైనా, వేడుక ఏదైనా చీరను మించిన ఎవర్‌గ్రీన్‌ డ్రెస్‌ లేదన్నది నేటితరమూ ఒప్పుకుంటున్న మాట. అయితే, ఒకప్పటిలా కాకుండా చీరకట్టులో ఇప్పుడు ఎన్నో మార్పులు వచ్చాయి. పవిటను తీరొక్కతీరుగా అలంకరించడం నిన్నటి మాట. బ్లౌజ్‌ పార్ట్‌ని భిన్నమైన టాప్స్‌తో చీరకు జత చేయడం నేటి మాట అయ్యింది. అవి నవతరం మెచ్చేలా స్టైలిష్‌ లుక్‌తో పాటు సంప్రదాయతను చాటేలా ఉండటం ప్రధానంగా కనిపిస్తోంది. షార్ట్‌ లేదా లాంగ్‌ కుర్తా – చీర కాంబినేషన్‌ లేదా లాంగ్‌ జాకెట్‌–చీర, షర్ట్‌ స్టైల్‌ –చీర.. ఇలా ఈ స్టైల్స్‌ ఆధునిక కాలం అమ్మాయిలను బాగా ఆకట్టుకుంటున్నాయి. ప్రత్యేక సందర్భాలలో ఈ కుర్తా లేదా కుర్తీ చీరకట్టు మరింత ప్రత్యేకతను చాటుతోంది. 

చీరకట్టులో కుర్తీ శారీ నేటి కాలానికి తగినట్టు స్టైలిష్‌గా ఉండటంతో ఆకట్టుకుంటోంది. పైగా సౌకర్యవంతంగా ఉంటుంది.కుర్తా శారీ ఎంపికలో రెండు భిన్న రంగులను ఎంచుకోవాలి. అలాగే ఫ్యాబ్రిక్‌లోనూ మార్పులు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అంచుతో కూడిన ప్లెయిన్‌ శారీ అయితే తెల్లటి కుర్తా టాప్‌గా ధరిస్తే చాలు మంచి కాంబినేషన్‌ అవుతుంది. ∙ప్రింటెడ్‌ శారీకి ప్లెయిన్‌ కుర్తా పర్‌ఫెక్ట్‌ ఎంపిక.


చీరకట్టులోనే కొత్తదనం కనిపిస్తుంది కాబట్టి ఇతరత్రా ఆభరణాల అలంకరణ అవసరం లేదు. సింపుల్‌గా చెవులకు జూకాలను ధరిస్తే సరిపోతుంది. క్రోషెట్‌ లేదా లేస్‌ ఫ్యాబ్రిక్‌ కుర్తాలు కూడా బ్లౌజ్‌ పార్ట్‌ (కుర్తా టాప్‌)కి బాగా నప్పుతాయి. షార్ట్‌ కుర్తీ వేసుకున్నప్పుడు అంచులు తగిలేలా పవిటను తీయాలి. అలాగే లాంగ్‌ కుర్తా (నీ లెంగ్త్‌) ధరించిన్నప్పుడు పవిటను కుర్తా అంచులను తగిలేలా సెట్‌ చేస్టే స్టైలిష్‌ లుక్‌తో ఆకట్టుకుంటుంది.  షార్ట్‌ లేదా లాంగ్‌ కుర్తీలను చీర మీదకు ధరించడం వల్ల ఫార్మల్‌ లుక్‌తో ఆకట్టుకుంటారు. ప్రత్యేక∙సభలు, సమావేశాలకూ ఈ లుక్‌ నప్పుతుంది.
– కీర్తిక, డిజైనర్‌

 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

18న తాడేపల్లిగూడెంలో సిరిధాన్యాలు, ఔషధ మొక్కలపై సదస్సు

తిరుపతిలో నవంబర్‌ 17–18 తేదీల్లో దేశీ విత్తనోత్సవం

18,19 తేదీల్లో అనంతపురం, కర్నూలు జిల్లాల్లో డా. ఖాదర్‌ సభలు

పత్తి రైతు కుటుంబాన్ని విస్మరించిన ప్రభుత్వం

వరిలో ఊద సాగుతో తగ్గిన కలుపు!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

'సైరా' మ్యూజిక్‌ డైరెక్టర్‌ లైవ్‌ కన్సర్ట్‌

ఆమిర్‌ సినిమాకు పెట్టుబడి కూడా రాదా..?

స్టార్‌ హీరో సీరియస్‌ వార్నింగ్‌

బ్యాక్‌ టు ఫస్ట్‌ గర్ల్‌ఫ్రెండ్‌ అంటోన్న సుధీర్‌ బాబు!

‘వ్యక్తిగత ప్రశ్నలకు సమాధానం చెప్పను’

మీటూ.. నా రూటే సపరేటు!