పూసా వసూల్‌

7 Sep, 2018 00:23 IST|Sakshi

ఫ్యాషన్‌

తెల్లని ముత్యాలుఒక్కొక్కటి ఒక్కో తీరుగుట్టపూసలని వాటికి పేరుఒక్కో పూస చేర్చిఒద్దికగా అల్లితేఆ పూస గుచ్చిన అందాన్నిచూసినవారు ఒళ్లంతా కళ్లు చేసుకోవాల్సిందే! వేడుక ఏదైనా పూసలు మేనును మెరిపించాల్సిందే!ప్రతి పూసా చూపులలెక్కలు వసూల్‌  చేయాల్సిందే!

గుట్ట పూసల హారాలు పట్టు చీరల మీదకు ఎంత అందంగా ఉంటున్నాయో తెలిసిందే కదా! పెళ్లి, పండగ సంప్రదాయ వేడుకల్లో గుట్టపూసల ఆభరణాల ధరించడం ఇప్పుడు ట్రెండ్‌ అయ్యింది. అయితే, వీటి ఖరీదు ఎక్కువే! గుట్టపూసల ఆభరణాన్ని భర్తీ చేయడానికా అన్నట్టుగా ఇప్పుడు మగ్గం వర్క్‌లో గుట్టపూసలతో చేసిన ఎంబ్రాయిడరీ బ్లౌజ్‌లు అమితంగా ఆకట్టుకుంటున్నాయి.

ఒకే పరిమాణంలో కాకుండా ఇష్టం వచ్చిన  తీరులో ఉండే గుట్టపూసల(ముత్యాలు)ని హారంగా చేసి, అతివ మెడను అందంగా అలంకరించారు ఆభరణాల నిపుణులు. అదే థీమ్‌ని తెల్లని పూసలతో పట్టుచీర జాకెట్ల మీద ముచ్చట గొలుపుతున్నారు ఎంబ్రాయిడరీ డిజైనర్లు. ఈ డిజైన్‌లో ఎన్ని పూసలు ఎక్కువ వాడితే అంత ఖరీదు అని గుర్తించాలి. సింపుల్‌ లేదా గ్రాండ్‌ డిజైన్‌ అనేది బడ్జెట్‌ చీర హంగును బట్టి డిసైడ్‌ చేసుకోవచ్చు. ఎంత చిన్న డిజైన్‌ అయినా గుట్టపూసల డిజైన్‌ వేడుకలో హైలైట్‌గా నిలుస్తుంది.

కుందన్స్‌తో కనువిందు
ఎరుపు, పసుపు, పచ్చ కుందన్స్‌తో మరింత అందంగా దోస్తీ కడుతున్నాయి తెల్లని  పూసలు. వీటికి జరీ జిలుగులు కూడా తోడై కొత్త సింగారాలతో వయ్యారాలు పోతున్నాయి. 


పట్టు చీర అంచు మీద 
నాటి రోజుల్లో పట్టుచీరలోనే వచ్చే కాంబినేషన్‌ బ్లౌజ్‌ను డిజైన్‌ చేయించుకునేవారు. ఆ స్టైల్‌ పాత బడి మూలన పడింది. అయితే, ఇటీవల మళ్లీ ఈ తరహా స్టైల్‌ వెలుగులోకి వచ్చింది. పట్టు చీర అంచు ఉండే పొడవు చేతులకు గుట్టపూసలతో చేసిన డిజైన్‌ అదనపు హంగులతో ఆకట్టుకుంటుంది. దీంతో ఓల్డ్‌ అని మూలన పడేసిన స్టైల్‌ ఇప్పుడు ‘వావ్‌’ అనిపిస్తోంది.

కాసుల  కాంబినేషన్‌
లక్ష్మీ కాసులతో డిజైన్‌ చేసిన మగ్గం వర్క్‌లు తెలిసినవే! ఇప్పుడు అందంగా ఉండే గుట్టపూసల డిజైన్‌కి అదనంగా కాసులను కూడా వాడి మరింత ఆకర్షణీయంగా డిజైన్‌ చేస్తున్నారు. 

ముదురు రంగులు
ముదురు ఎరుపు, నీలం, పచ్చ, గులాబీ రంగు పట్టు ఫ్యాబ్రిక్‌లు పూసల డిజైన్‌కి బాగా నప్పుతాయి. తెల్లటి ముత్యాలు, పూసలను ఈ డిజైన్‌ ఔట్‌లెట్‌గా వాడుతారు. ముదురు రంగు ఫ్యాబ్రిక్‌ అయితే తెల్లటి పూసల హంగులు మరింత బాగా కనిపిస్తాయి. 
నిర్వహణ - ఎన్‌.ఆర్‌. 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు