ఆజ్‌ కా లిబాజ్‌

8 Jun, 2018 00:34 IST|Sakshi

‘లిబాస్‌’ అంటే దుస్తులు.అందాన్ని రూపాన్ని ఇచ్చే ఇవాళ్టి దుస్తులు ఇవి.రంగులతో అల్లికలతో మెరుపును తెచ్చే ఇవాళ్టి దుస్తులు ఇవి.ప్రత్యేక సందర్భాల్లో ప్రత్యేకంగా కనిపించడానికి కూర్చిన నేటి దుస్తులు ఇవి. కట్‌లోనూ, కుట్టులోనూ ట్రెండ్‌లో ఉన్న దుస్తులు ఇవి.నేటి దుస్తులు. స్త్రీలు మెచ్చే దుస్తులు. ఆజ్‌ కా లిబాస్‌.

షల్వార్‌ కమీజ్, అనార్కలీ సూట్స్, పటియాలా కుర్తీస్‌ ఇన్నాళ్లూ డ్రెస్‌లలో మహరాణుల్లా వెలిగిపోయాయి. ఇప్పుడు వీటి హవా తగ్గి షరారస్, లెహంగాస్, షార్ట్‌ లెంగ్త్‌లో ఉండే విభిన్నమైన ఫ్రాక్స్, కుర్తీస్‌ ట్రెండ్‌లోకి వచ్చాయి. వీటికి బెల్‌బాటమ్‌ ట్రౌజర్స్, కప్రీస్, టులిప్‌ షల్వార్స్‌ జత కట్టాయి. అమ్మాయిలు ముఖ్యంగా టీనేజర్స్‌ వెస్ట్రన్‌ స్టైల్‌లో ఉండే షార్ట్‌ కుర్తీస్, ఫ్రాక్స్‌.. జీన్స్, ప్యాంట్స్, స్కిన్సీ టైట్స్‌ మీదకు విరివిగా వాడుతున్నారు. ఇవన్నీ హాటెస్ట్‌ ట్రెండ్‌. వెస్ట్రన్‌ పార్టీలతో పాటు సంప్రదాయ వేడుకల్లో ప్రత్యేకత కలిగించనున్నాయి. వీటిలో మీ ఎంపిక ఏదైనా బెస్ట్‌ డ్రెస్డ్‌గా నిలిచిపోతుంది. అయితే, శరీరాకృతిని బట్టి డ్రెస్‌ ఎంపిక ఎప్పుడూ చక్కగా నప్పుతుంది. 

షరారా కమీజ్‌: ఇది 2000 సంవత్సరంలో మంచి కాంబినేషన్‌గా హిట్‌ అయిన డ్రెస్‌. ఈ స్టైల్‌ ఇప్పుడు మళ్లీ వచ్చింది. చాలా మంది బాలీవుడ్‌ నటీమణులు ఈ స్టైల్‌లో కనువిందు చేస్తున్నారు. షరారా బాటమ్‌ ఎక్కువ కుచ్చులతో ఆకట్టుకుంటుంది. దీని మీదకు స్కర్ట్‌ లేదా కమీజ్‌ చక్కగా నప్పుతుంది. ఘరారా మనవాళ్ల కామన్‌గా పిలిచే పేరు. దీనినే షరారా అంటున్నారు. మోకాళ్ల దగ్గర నుంచి బాటమ్‌ కుచ్చులతో వెడల్పుగా ఉంటుంది. వీటినే వైడ్‌ లెగ్గ్‌డ్‌ ప్యాంట్స్‌ అని కూడా అంటారు. మందపాటి బ్యాండ్‌ లేడా లేస్‌ లేదా గోటా పట్టీతో పై భాగాన్ని, కింది భాగాన్ని విడిగా చూపడానికి వాడతారు. దీంతో ఈ బాటమ్‌ రెండు భాగాలుగా ఉంటుంది. మీ శరీరాకృతిని బట్టి దీనిని ధరించాలి. ఎందుకంటే ఎత్తు తక్కువ ఉండి, బక్కపలచగా ఉండే శరీరాకృతి గల వారికి ఈ స్టైల్‌ బాగుంటంది. దీనిని మీదకు క్రాప్‌ టాప్‌ వేసుకొని దుపట్టా జత చేస్తే సంప్రదాయ డ్రెస్‌ అవుతుంది. ఈ షరారా మీదకు కుర్తీ లేదా కమీజ్‌ కూడా బాగుంటుంది. దీని మీదకు పొడవాటి కుర్తా ధరిస్తే మీ ఆకృతి కూడా పొడవుగా కనిపిస్తుంది.

సిగరెట్‌ ప్యాంట్‌ విత్‌ కమీజ్‌:రెండేళ్ల క్రితం కమీజ్‌ విత్‌ ప్యాంట్స్‌ సూపర్‌ స్టైల్‌లో ఉండేవి. కమీజ్‌కే కాస్త ఆకట్టుకునే బాటమ్స్‌ జత చేసి స్టైల్‌ని బెటర్‌ చేశారు. ఫిటింగ్‌ కోసం సిగరెట్‌ప్యాంట్స్‌ సరైన ఫిటింగ్‌ కోసం ధరిస్తున్నారు. సిగరెట్‌ ప్యాంట్స్‌ మీద ఎంబ్రాయిడరీ చక్కగా కనిపిస్తుంది.

టులిప్‌ స్టైల్‌ ప్యాంట్స్‌:గ్లామరస్‌ని పెంచుతూ వెలుగులోకి వచ్చాయి. ఇది షల్వార్‌ని రీప్లేస్‌ చేసిందని చెప్వచ్చు. ఈ ప్యాంట్స్‌ మీదకు ఎంబ్రాయిడరీ చేసిన ఫ్రాక్స్, కమీజ్‌లు మరింత అందాన్ని పెంచుతాయి.
ఎంబ్రాయిడరీ వెర్సస్‌ లేత రంగులు: ఎలాంటి ఎంబ్రాయిడరీ లేకుండా ఉండే కమీజ్‌ను ఎంపిక చేసుకొని దానికి బాటమ్‌గా ఎంబ్రాయిడరీ చేసిన షరారా ధరిస్తే చాలు మీ లుక్‌లో గొప్ప మార్పు కనిపిస్తుంది. 
∙కమీజ్‌ లేదా ఫ్రాక్‌ డిజైన్స్‌లో నెక్‌ బోట్‌ లేదా బార్టట్‌ నెక్స్‌ ఇప్పుడు ట్రెండ్‌లో ఉన్నాయి.  
∙ఎంబ్రాయిడరీ చేసిన గ్రాండ్‌ లెహంగాలు, కుర్తీలు ఇప్పుడూ ట్రెండ్‌లో ఉన్నాయి. మీ అభిరుచి మేరకు వీటిని ఎంపిక చేసుకోవచ్చు. 
ఇక ఆభరణాల వంటి ఇతర అలంకరణలు డ్రెస్‌కు తగ్గట్టు ఎంచుకుంటే చాలు ఈ ఔట్‌ఫిట్స్‌ మీ పూర్తి ఆహార్యాన్ని మార్చివేస్తాయి.

ఆభరణాలు: 
∙ఈ తరహా డ్రెస్సుల మీదకు టస్సెల్‌ ఇయర్‌ రింగ్స్‌ బాగా నప్పుతాయి. ∙బ్యాంగిల్‌ సెట్స్‌లో ఏదైనా ఒకటి పెద్దది డిజైనర్‌ బ్యాంగిల్‌ ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
∙లేత రంగులు ముఖ్యంగా స్కిన్‌ కలర్స్, పీచ్‌ లేదా ఆకుపచ్చ కాంబినేషన్స్‌ పండగ కళను రెట్టింపు చేస్తాయి.
∙గోల్‌ టిక్కా మెహెందీ డిజైన్లు పండగ సంబరాన్ని మరింత కళగా మార్చుతాయి. 
– ఎన్‌.ఆర్‌
– అయేషా అజహర్, ఫ్యాషన్‌ డిజైనర్‌ 
లఖోటియా ఫ్యాషన్‌ ఇన్‌స్టిట్యూట్, హైదరాబాద్‌ 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రోజుకు వెయ్యి లీటర్ల నీటితోనే చేపల సాగు..

'పాడి'తో బతుకు 'పంట'!

సంతృప్తి.. సంతోషం..!

మళ్లీ మురిపి'స్టారు'

‘ప్రేమ’ లేకుండా పోదు

నలుగురు ఓహ్‌ బేబీలు

పక్కింటి ఎండమావి

చీకటికి అలవాటుపడని కళ్లు

పెత్తనం పోయి కర్ర మిగిలింది

ఎత్తయిన సిగ్గరి

యువత. దేశానికి భవిత

బజ్జీ బిర్యానీ.. స్నాకం 'పాకం'

మద్దూరు వడను వదిలేస్తే బాధపడకతప్పదు..

చందమామ నవ్వింది చూడు

ఆఫీస్‌ ఇలా ఉండకూడదు

ప్లాస్టిక్‌ ఇల్లు

సౌరశక్తి ప్లాంట్‌లలో అబూదాబి రికార్డు!

మ్యావ్‌ మ్యావ్‌... ఏమైపోయావ్‌!

మా అమ్మపై ఇన్ని పుకార్లా

చక్కెర చాయ్‌తో క్యాన్సర్‌!

చిన్నారుల కంటి జబ్బులకు చికిత్సాహారం

మేము సైతం అంటున్న యాంకర్లు...

ఒత్తిడి... వంద రోగాల పెట్టు

చేతులకు పాకుతున్న మెడనొప్పి... పరిష్కారం చెప్పండి

మేనత్త పోలిక చిక్కింది

ఆ టీతో యాంగ్జైటీ మటుమాయం

టెడ్డీబేర్‌తో సరదాగా ఓరోజు...!

వినియోగదారుల అక్కయ్య

‘జర్నలిస్ట్‌ కావాలనుకున్నా’

సోపు.. షాంపూ.. షవర్‌ జెల్‌..అన్నీ ఇంట్లోనే!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

షారుక్‌కు మరో అరుదైన గౌరవం

వార్నింగ్‌ ఇచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’

‘ఇది వారి పిచ్చి ప్రేమకు నిదర్శనం’

హమ్మయ్య.. షూటింగ్ పూర్తయ్యింది!

బాలీవుడ్‌కు ‘నిను వీడని నీడను నేనే’

అదే నా ప్లస్‌ పాయింట్‌