చెవికి సీతాకోకచిలుకలు

27 Jul, 2018 01:27 IST|Sakshi

టస్సెల్‌ ఇయర్‌ రింగ్స్‌

దారపు పోగులతో అందంగా తీర్చిదిద్దిన చెవి జూకాలు ఇవి. రంగు రంగుల సిల్క్, ఊలు దారాలతో చేసి ఈ ఆభరణాలు సంప్రదాయ ఆభరణాలు కావు. ఆధునిక దుస్తుల మీదకు మరింత అందమైన సొబగులు అద్దే టస్సెల్‌ ఇయర్‌ రింగ్స్‌. వేసుకున్న డ్రెస్‌ అందం మరింత పెంచేలా, సరైన విధంగా మ్యాచ్‌ అయ్యేలా ఇంపుగా ఉండడం ఈ డిజైనర్‌ ఇయర్స్‌ రింగ్స్‌ ప్రత్యేకత. వీటిని చాలా సులువుగా ఎవరికి వారు తయారుచేసుకోవచ్చు.  


తయారీ:  1 దారపు పోగులను సమభాగాలుగా తీసుకోవాలి. కావల్సినంత పరిమాణం దారపు పోగులను కలిపి, మధ్యకు తీసుకోవాలి. మధ్య భాగాన్ని మరో దారంతో ముడివేయాలి. 2 తీగకు గుచ్చి గోల్డ్‌ కలర్‌ పూసను దారం ముడి వేసిన భాగంలో కనెక్ట్‌ చేసి, ఫ్యాబ్రిక్‌ గ్లూ పెట్టి సెట్‌ చేయాలి. ∙పూస అటూ ఇటూ జరగకుండా తీగను పట్టుకారతో ముడి తిప్పాలి. 3 చెవికి తగిలించే హుక్‌ను ముడిలా తిప్పిన తీగకు సెట్‌ చేయాలి. ∙కింది భాగంలో సమంగా లేని దారపు పోగులను కత్తిరించాలి. 
 ఇలాగే రంగు రంగుల చెవి హ్యాంగింగ్స్‌ను తయారు చేసుకోవచ్చు. వాటిలో ఇవి కొన్ని మోడల్స్‌

కావల్సినవి: ’ సిల్క్‌ లేదా ఊలు దారాలు’ గోల్డ్‌ కలర్‌ పూసలు’ గోల్‌ కలర్‌ తీగ’ ఇయర్‌ రింగ్‌ హుక్స్, పట్టుకార

మరిన్ని వార్తలు