భూతాపోన్నతికి చెక్‌ పెట్టేందుకు కొత్త ఆలోచన

14 Apr, 2018 00:42 IST|Sakshi

నీటిలో పెరిగే నాచును సక్రమంగా వాడుకోవడం ద్వారా భూమి మీద మనిషి మనుగడను సవాలు చేస్తున్న భూతాపోన్నతి ముప్పును తప్పించుకోవచ్చు అంటున్నారు కార్నెల్, డ్యూక్, హవాయి యూనివర్శిటీల శాస్త్రవేత్తలు. నాచును విరివిగా పెంచడం వల్ల వాతావరణంలోని కార్బన్‌డయాక్సైడ్‌ను ఆ చిన్ని మొక్కల్లో నిక్షిప్తం చేయవచ్చునని ఇప్పటికే తెలుసు. ఈ నాచును శుద్ధి చేస్తే బయోడీజిల్‌ను తయారు చేయవచ్చు. అదే సమయంలో మనకు ఆహారంగా ఉపయోగపడగల ప్రొటీన్‌ను కూడా తయారుచేసుకోవచ్చు.

ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నమాట. దాదాపు ఏడు వేల ఎకరాల్లో నాచును పెంచితే.. ఒకవైపు అంతే స్థలంలో పండేంత సోయా ప్రొటీన్‌ను అందించడంతోపాటు దాదాపు కోటి 70 లక్షల కిలోవాట్ల విద్యుత్తును అదనంగా ఉత్పత్తి చేయవచ్చునని ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్త ఛార్లెస్‌ గ్రీన్‌ అనే శాస్త్రవేత్త తెలిపారు. ఈ చిన్న ప్రాజెక్టు ద్వారా దాదాపు 30 వేల టన్నుల కార్బన్‌డయాక్సైడ్‌ను వాతావరణంలో నుంచి తొలగించవచ్చునని వివరించారు. నాచుతో ఉత్పత్తి అయ్యే ప్రొటీన్‌ మంచి పోషకాలతో కూడి ఉంటుందని, మనుషులకే కాకుండా చేపల పెంపకంలోనూ వాడుకోవచ్చునని చెప్పారు. పర్యావరణానికి హాని జరక్కుండా కార్బన్‌డయాక్సైడ్‌ను తొలగించేందుకు ఈ పద్ధతి బాగా ఉపయోగపడుతుందని వివరించార 

మరిన్ని వార్తలు